Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి  జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ భారీ  ఆర్థిక సాయం

వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ భారీ ఆర్థిక సాయం

వార్త 2 weeks ago

Dr Priyanka Death: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడిపి ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక కుటుంబానికి ఆమె చదువుతున్న జీఎస్‌ఎల్ (GSL) మెడికల్ కాలేజీ యాజమాన్యం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచాయి.

జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పిజి (Dermatology PG) ఫస్టియర్ చదువుతున్న ప్రియాంక మృతి పట్ల కాలేజీ వర్గాలు, తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Read Also:Rajahmundry Crime: కాతేరు శివార్లలో తీవ్ర కలకలం: రక్తమడుగులో ప్రేమికులు.. అసలేం జరిగింది?

జీఎస్‌ఎల్ కాలేజీ యాజమాన్యం పరామర్శ & సాయం

రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ ఆవరణలో ప్రియాంక స్మరకార్థం సంతాప సభ నిర్వహించారు. ప్రియాంక కుటుంబానికి సంస్థ తరఫున రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు కాలేజీ ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు. జీఎస్‌ఎల్ డెర్మటాలజీ విభాగానికి చెందిన వైద్యులు, తోటి విద్యార్థులు హైదరాబాద్‌ వెళ్లి ప్రియాంక కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ గన్ని సాధిక రూ. 20 లక్షల చెక్కును స్వయంగా అందజేయనున్నారు. ప్రియాంకను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలలో కాలేజీ మొదటి నుంచి అండగా నిలిచిందని యాజమాన్యం పేర్కొంది.

Dr Priyanka Death: ఏపీ ప్రభుత్వం నుండి సాయం & అంత్యక్రియలు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ప్రియాంక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది. ఏపీ మంత్రి టీజీ భరత్ స్వయంగా ప్రియాంక భౌతికకాయానికి నివాళులర్పించి, ఆమె తండ్రి వెంకటేశ్‌కు రూ. 20 లక్షల ప్రభుత్వ పరిహారపు చెక్కును అందజేశారు. ప్రియాంక ఆసుపత్రి చికిత్స ఖర్చులతో పాటు ఆమె మెడికల్ సీటుకు సంబంధించిన ఫీజు ఖర్చులను కూడా ప్రభుత్వం తిరిగి అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాన్ని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పూర్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం జరిగిన అంతిమయాత్రలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.

    Epaper: epaper.vaartha.com

    ఆర్ఎంపీ వికటించిన ఇంజెక్షన్.. 8వ తరగతి విద్యార్థిని మృతి!

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha