డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి ముందు కుటుంబీకుల ఆందోళన
Narsapur Amma hospital: వైద్యం వికటించి ఓ పసికందు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు కుటుంబీకుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు దంపతుల 8 నెలల పసికందు మణి వర్ధన్ కు సోమవారం మూడు గంటల సమయంలో జ్వరం వచ్చిందని నర్సాపూర్ లోని అమ్మ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అనంతరం బాలుడికి పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్సలు జరిపారు.
Read Also : Punjab's Patiala: పాటియాలాలో 22 ఏళ్ల వైద్య విద్యార్థి హత్య కలకలం
8-month-old baby dies due to medical negligence!
Narsapur Amma hospital: సంగారెడ్డి ఆసుపత్రికి తరలింపు – అప్పటికే మృతి
అయితే మంగళవారం ఉదయం వైద్యులు పసికందు చిన్నారి మణి దీప్ పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. వెంటనే కుటుంబీకులు బాలుడిని అంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సంగారెడ్డి ఆసుపత్రిలో అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు చెప్పారు.
అమ్మ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని కావాలని పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించే విధంగా చేశారని కుటుంబీకులు ఆరోపించారు. పసి కందు బాలుడు మణి వర్ధన్ మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. అమ్మ ఆసుపత్రిలో ఇటువంటి అల్లర్లు జరగకుండా ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

