Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ 'గండ్ర గొడ్డలి పార్టీ'.. మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ 'గండ్ర గొడ్డలి పార్టీ'.. మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

వార్త 1 week ago

Vasamsetti Subhash: ఆంధ్రప్రదేశ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జగన్ రాజకీయాలు, వ్యక్తిగత వైఖరిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఘాటైన విమర్శలు గుప్పించారు. జగన్ తన సొంత ఇంటి నుంచే వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారని, అసలైన వెన్నుపోటు దినానికి ఆయనే కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారని మండిపడ్డారు. కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని కూడా జగన్ వదల్లేదని దుయ్యబట్టారు. చివరికి సొంత బాబాయ్‌కి వెన్నుపోటుతో పాటు గొడ్డలి పోటు కూడా పొడిపించారని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘గండ్ర గొడ్డలి పార్టీ’గా మారిపోయిందని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు.

Read also: Ambedkar statue Unveiling: కనిగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న చిరాగ్ పాశ్వాన్, హోంమంత్రి అనిత!

జగన్‌కు కరెంట్ షాక్ ట్రీట్‌మెంట్ అవసరం!

వైఎస్ జగన్ మానసిక స్థితిని ఉద్దేశించి మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌కు వాడుతున్న మందుల డోస్ పెంచితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని వైద్యులే భయపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆయన ప్రస్తుత స్థితికి అప్పుడప్పుడు కరెంట్ షాక్ లాంటి వైద్య చికిత్సలు ఇస్తేనే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జగన్ పెట్టే ప్రెస్‌మీట్లను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని, కేవలం తమ రోజువారీ 'స్ట్రెస్ రిలీఫ్' కోసం టీవీల్లో చూసి నవ్వుకుంటున్నారని లೇವనెత్తారు.

Vasamsetti Subhash: 'కోటి సంతకాల' కార్యక్రమం ఒక ప్రహసనం!

విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన బ్రిడ్జ్ కోర్సులపై వైసీపీ చేస్తున్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. గతంలో పేకాట క్లబ్బులు, క్యాసినోలు నడిపించిన బ్యాచ్‌కు విద్యా ప్రమాణాల గురించి, బ్రిడ్జ్ కోర్సుల ప్రాధాన్యత గురించి ఏం తెలుస్తుందని ఆయన నిలదీశారు. అలాగే, వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కోటి సంతకాల’ ఉద్యమం పూర్తిగా అభాసుపాలైందని విమర్శించారు. ఆ కార్యక్రమానికి సాధారణ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో, టార్గెట్ పూర్తి చేయడానికి వైసీపీ నాయకులే ఒకరి సంతకాలు ఒకరు మార్చి మార్చి పెడుతూ నవ్వులపాలయ్యారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

విచిత్ర ఘటన..మరణించిన నాలుగేళ్లకు పింఛన్‌ మంజూరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha