Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విచిత్ర ఘటన..మరణించిన నాలుగేళ్లకు పింఛన్‌ మంజూరు

విచిత్ర ఘటన..మరణించిన నాలుగేళ్లకు పింఛన్‌ మంజూరు

వార్త 1 week ago

Chittoor: సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా వృద్ధులకు, అర్హులకు పింఛన్లు సకాలంలో అందడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి.

కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా, అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసే వింత సంఘటన ఒకటి వెలుగుచూసింది. ఒక మహిళ మరణించిన నాలుగేళ్ల తర్వాత ఆమెకు పింఛన్ మంజూరు కావడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 Dwakra Pension Scheme

Read also: Muni Koodali Pushkar Ghat:రాజానగరంలో ముని కూడలి ఘాట్‌కు నారా దేవాన్ష్ పేరు.. రూ. కోటి నిధులు కేటాయించిన డిప్యూటీ సీఎం!

అసలేం జరిగిందంటే..?

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం బట్టువారిపల్లె గ్రామానికి చెందిన సావిత్రమ్మ అనే మహిళ గతంలో డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉండేవారు. నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రభుత్వం ప్రతినెలా రూ.500 చొప్పున పింఛను అందిస్తుంది. అయితే, సావిత్రమ్మ దురదృష్టవశాత్తూ నాలుగేళ్ల క్రితమే కన్నుమూశారు.

కానీ, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం తాజాగా ఆమెకు డ్వాక్రా పింఛను మంజూరైనట్లు చూపించింది. ఈ క్రమంలో సంబంధిత పథకానికి చెందిన సిబ్బంది ఈ నెల పింఛను డబ్బులను పంపిణీ చేయడానికి నేరుగా సావిత్రమ్మ ఇంటికి వెళ్లారు. అక్కడ విచారించగా.. ఆమె ఎప్పుడో నాలుగేళ్ల క్రితమే మరణించిందనే అసలు నిజం బయటపడింది. దీంతో అవాక్కైన సిబ్బంది, ఆ పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి పంపేందుకు సావిత్రమ్మ మరణించినట్లు ధృవీకరిస్తూ స్థానికుల నుంచి సంతకాలు తీసుకున్నారు.

Chittoor: ఏపీలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల జోరు

ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పింఛన్లను పంపిణీ చేస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీనే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నేరుగా నగదును అందిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయినా, మూడో నెలలో ఆ మొత్తాన్ని కలిపి ఒకేసారి తీసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.

తాజాగా జూన్ 1వ తేదీన జరిగిన పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం కొత్తగా 5,606 మందికి స్పౌజ్‌ (జీవితభాగస్వామి) కేటగిరీ కింద పింఛన్లను మంజూరు చేసింది. జూన్ నెలలో మొత్తం 62.34 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2,728 కోట్లను విడుదల చేసింది. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పింఛన్ల పంపిణీ కోసమే ఏకంగా రూ.65,886 కోట్లను వెచ్చించడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఏపీ ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha