Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ నేర చరిత్ర బయటపడింది.. అనురాధ సంచలన ఆరోపణలు

వైసీపీ నేర చరిత్ర బయటపడింది.. అనురాధ సంచలన ఆరోపణలు

వార్త 2 weeks ago

వైసీపీపై పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు

AP Politics : ప్రపంచస్థాయి ఇన్వెస్టిగేటివ్ ఛానల్ విడుదల చేసిన డాక్యుమెంటరీ వైసీపీ నాయకుల నేర చరిత్రను బయటపెట్టిందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఆరోపించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. జగన్ రెడ్డి నాయకత్వంలోని పార్టీని కిల్లర్ పార్టీ, క్రిమినల్ పార్టీ, గొడ్డలి పార్టీగా అభివర్ణించారు.

నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడిగా జగన్ రెడ్డి గురించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా అధ్యయనాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాజాగా జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్ విడుదల చేసిన "ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్" డాక్యుమెంటరీలో పలువురు వ్యక్తుల నేర చరిత్రలను ప్రస్తావించారని తెలిపారు.

కొల్లం గంగిరెడ్డిపై ఆరోపణలు

డాక్యుమెంటరీలో ప్రస్తావించిన కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ అని అనురాధ ఆరోపించారు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహిత అనుచరుడని పేర్కొన్నారు. కడప జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపగల వ్యక్తిగా గంగిరెడ్డి వ్యవహరించారని అన్నారు.

అలిపిరి వద్ద జరిగిన క్లైమోర్ మైన్స్ దాడి కేసులో కూడా గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నారని ఆమె విమర్శించారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ అతని పేరు వినిపించిందని ఆరోపించారు. జగన్ హయాంలో గంగిరెడ్డి సోదరుడు కీలక పదవిలో పనిచేశారని గుర్తు చేశారు.

Read Also:Telangana : తెలంగాణ లో పోటాపోటీగా రాజకీయ సభలు!

 AP Politics

వైసీపీపై మరిన్ని ఆరోపణలు

జగన్ ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించారో ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయిందని పంచుమర్తి అనురాధ అన్నారు. ప్రపంచస్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఎన్. చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే.. జగన్ మాత్రం నేర చరిత్ర ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేశారని ఆరోపించారు.

వైసీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తే ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉపయోగించే గొడ్డళ్లు ఇడుపులపాయ నుంచి వెళ్లాయని వ్యాఖ్యానించారు. వైసీపీకి చెందిన మరికొంత మంది నేతలపై కూడా భవిష్యత్తులో ఇలాంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: మొక్కజొన్నతో పాటు జొన్నల కొనుగోలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha