Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Valentine's Day 2026: ఫిబ్రవరి 14నే ప్రేమికుల దినోత్సవం ఎందుకు?

Valentine's Day 2026: ఫిబ్రవరి 14నే ప్రేమికుల దినోత్సవం ఎందుకు?

వార్త 4 months ago

ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు ప్రతీకగా మారిన ప్రేమికుల దినోత్సవం వెనుక ఓ త్యాగగాథ దాగి ఉంది. ఈ కథ రోమన్ సామ్రాజ్య కాలానికి చెందినది. అప్పట్లో పాలన సాగించిన రోమన్ చక్రవర్తి క్లాడియస్-II ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగి ఉండేవాడు.

వివాహం చేసుకున్న పురుషుల కంటే, ఒంటరిగా ఉన్న యువకులే యుద్ధరంగంలో ధైర్యంగా, పూర్తి అంకితభావంతో పోరాడతారని ఆయన విశ్వసించాడు. కుటుంబ బాధ్యతలు లేని సైనికులు మాత్రమే యుద్ధంలో విజయం సాధిస్తారని భావించాడు.

Madhya Pradesh: ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య

వాలంటైన్ అనే పాస్టర్ రహస్యంగా ప్రేమికులకు వివాహాలు చేసేవారు

ఈ ఆలోచనతోనే క్లాడియస్-II సైనికులకు పెళ్లి చేసుకోవద్దని కఠిన ఆంక్షలు విధించాడు. అప్పట్లో యువ సైనికులు ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే వాలంటైన్ అనే పాస్టర్ చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా ప్రేమికులకు వివాహాలు చేసేవారు. విషయం తెలిసిన చక్రవర్తి ఆయన ను, ఫిబ్రవరి 14న ఉరితీయించారు. ఆయన జ్ఞాపకార్థమే ప్రేమికుల రోజుగా జరుపుకోవడం ప్రారంభమైంది.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha