Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం

వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం

వార్త 2 months ago

ICC Rankings: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్ అప్‌డేట్‌లో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

పురుషుల వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియా ప్రపంచ నంబర్-1 జట్టుగా తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్‌లో కొనసాగుతున్నప్పటికీ.. ద్వితీయ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టు గట్టి పోటీనిస్తోంది.

 Team India No 1 ODI Team

Read also: FIFA World Cup 2026:ఫిఫా ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధం.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

వన్డేల్లో తగ్గిన పాయింట్ల అంతరం.. ముంచుకొస్తున్న కివీస్!

వార్షిక సమీక్ష తర్వాత భారత వన్డే రేటింగ్ పాయింట్లు 119 నుండి 118కి స్వల్పంగా తగ్గాయి. ఇదే సమయంలో న్యూజిలాండ్ జట్టు రెండు పాయింట్లను మెరుగుపరుచుకుని 113 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో గతంలో భారత్-కివీస్ మధ్య ఉన్న 8 పాయింట్ల వ్యత్యాసం ఇప్పుడు 5 పాయింట్లకు పరిమితమైంది. ఇక ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

టాప్-10లో పాక్‌కు షాక్.. సౌతాఫ్రికాకు ప్రమోషన్

తాజా అప్‌డేట్‌లో ప్రధాన మార్పు నాలుగో స్థానంలో కనిపించింది. దక్షిణాఫ్రికా జట్టు 102 పాయింట్లతో ఒక స్థానాన్ని ఎగబాకి నాల్గో స్థానానికి చేరుకోగా.. పాకిస్థాన్ (98 పాయింట్లు) ఐదో స్థానానికి పడిపోయింది. దిగువ రేటింగుల్లో కూడా కొన్ని ఆసక్తికర మార్పులు జరిగాయి. ఐర్లాండ్- జింబాబ్వేను వెనక్కి నెట్టి 11వ స్థానానికి చేరుకుంది. అమెరికా (USA)- స్కాట్లాండ్‌ను అధిగమించి 13వ స్థానంలో నిలిచింది.

టెస్టుల్లో మరియు మహిళల క్రికెట్‌లో ఆసీస్ టాప్

పరిమిత ఓవర్ల క్రికెట్ (ODI, T20) లో భారత్ నంబర్-1 గా దూసుకుపోతుండగా.. సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టుల్లో మాత్రం ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక మహిళల క్రికెట్‌ విషయానికి వస్తే.. వన్డే, టీ20 రెండు ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియా జట్టే తిరుగులేని నంబర్-1 గా నిలిచింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ఒలింపిక్స్‌లో కోహ్లీ ఉండాల్సిందే.. సెలక్టర్లకు శ్రీశాంత్ కీలక సూచన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha