Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరంగల్ స్విమ్మింగ్ పూల్ హత్య కేసు.. 9 మంది అరెస్ట్.

వరంగల్ స్విమ్మింగ్ పూల్ హత్య కేసు.. 9 మంది అరెస్ట్.

వార్త 2 months ago

Warangal Crime: వరంగల్ నగరంలో గర్భవతి అయిన భార్యతో పాటు ఇద్దరు అభంశుభం తెలియని కుమార్తెలను స్విమ్మింగ్ పూల్‌లో తోసి హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

ఈ కిరాతకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు అజారుద్దీన్‌తో పాటు, అతడికి సహకరించిన మరో 8 మందిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళా డాక్టర్ల ప్రమేయం ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిందితుడు అజారుద్దీన్ తన భార్యాబిడ్డలను వదిలించుకోవాలని ముందుగానే పథకం వేశాడు. ఈ నెల 2వ తేదీన తాను పనిచేసే స్విమ్మింగ్ పూల్ వద్దకు వారిని తీసుకెళ్లాడు. సాక్ష్యాలు దొరకకుండా ఉండటానికి అక్కడి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి, భార్యను, ఇద్దరు కుమార్తెలను నీటిలో తోసి దారుణంగా అంతమొందించాడు. వారు మరణించారని నిర్ధారించుకున్నాకే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి నాటకమాడాడు.

Read Also: Madhya Pradesh Crime: భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో భర్తను చంపించిన భార్య

Warangal Crime: అబార్షన్లు చేసిన మహిళా డాక్టర్లు

పోలీసుల దర్యాప్తులో అజారుద్దీన్ గతంలో చేసిన అకృత్యాలు కూడా బయటపడ్డాయి. డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ రవళి అనే ఇద్దరు వైద్యులు అజారుద్దీన్ భార్యకు గతంలో పలుమార్లు అబార్షన్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తేలిన ప్రతిసారి అజారుద్దీన్ తన భార్యకు బలవంతంగా అబార్షన్ చేయించేవాడు. 2021లో ఒకసారి, మళ్లీ 2026లో మరోసారి అబార్షన్లు చేయించాడు. ప్రస్తుతం ఆమె మూడోసారి గర్భం దాల్చగా, మళ్లీ ఆడపిల్లే అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు.

హత్యకు దారితీసిన కారణం

ఈసారి అబార్షన్ చేయించుకోవడానికి భార్య నిరాకరించడంతో, ఆమెను, ఇద్దరు ఆడపిల్లలను అడ్డు తొలగించుకోవాలని అజారుద్దీన్ నిర్ణయించుకున్నాడు. ఈ కుట్రలో అతడికి సహకరించిన కుటుంబ సభ్యులు, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారు కలిపి మొత్తం 9 మందిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మరో ఇద్దరు మహిళలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

గతంలో అక్రమంగా అబార్షన్లు నిర్వహించిన డాక్టర్ రవళి, డాక్టర్ బాల్నే పూర్ణిమల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వైద్య వృత్తిలో ఉండి ఇలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడటంపై నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని వరంగల్ పోలీసులు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha