EL nino impact:ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గి అనేక ప్రాంతాల్లో పంట పొలాలు తీవ్రంగా ఎండిపోతున్నాయి. ఈ ప్రభావం వల్ల వరి, చెరకు, పత్తి అనే మూడు ప్రధాన పంటల సాగుపై తీవ్ర ప్రతికూల పరిస్థితి పడింది.
మన రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈ సాగు విస్తీర్ణం ఊహించని రీతిలో తగ్గింది.
AP Telangana Rain Alert: ఏపీలో వర్ష బీభత్సం.. తిరుపతిలో నీట మునిగిన విమానాశ్రయం
Agricultural lands drying up due to the impact of El Niño
ఖరీఫ్ పంటల్లో నమోదైన మార్పులు
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అక్టోబర్ నివేదికల ప్రకారం ఈ ఎల్‌నినో ప్రతికూల వాతావరణం వల్ల వరి, చెరకు, పత్తి పంటలు వేయడం బాగా తగ్గింది. మరోవైపు గతేడాదితో పోలిస్తే పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు కొంతవరకు పెరిగింది. వర్షపాతం తక్కువగా ఉన్నా తట్టుకుని నిలిచే ప్రత్యామ్నాయ పంటలను వేయడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
EL nino impact:తెలంగాణలో పడిపోయిన వరి సాగు విస్తీర్ణం
ఈ సీజన్‌లో ముఖ్యంగా వరి సాగుపై పెద్ద దెబ్బ పడింది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఏకంగా 4.26 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గడం గమనార్హం. నీటి లభ్యత తగ్గడంతో రైతులు ఈసారి వరి సాగు తగ్గించి ఇతర ఆరుతడి పంటల వైపు అడుగులు వేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

