Dailyhunt
వర్మ పై బాబు ఆగ్రహంతో ఉన్నారా..?

వర్మ పై బాబు ఆగ్రహంతో ఉన్నారా..?

వార్త 1 week ago

పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ రచ్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్-ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

పిఠాపురం అథారిటీ (PADA) సమావేశంలో ఫ్లెక్సీల వివాదం కాస్తా టీడీపీ-జనసేన నేతల మధ్య తోపులాటకు దారితీయడం చంద్రబాబును తీవ్ర అసహనానికి గురిచేసింది. వర్మ వంటి సీనియర్ నేత బహిరంగంగా జనసేన నేతలతో గొడవకు దిగడం కూటమి ధర్మానికి విరుద్ధమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.

Read Also : Stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పల్లా శ్రీనివాస్‌కు చంద్రబాబు కీలక ఆదేశాలు

ఈ ఘటనపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు, ప్రోటోకాల్ అంశాలపై అంత సీరియస్‌గా స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాట్లు జరిగితే వాటిని పార్టీ అంతర్గత వేదికలపై లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప, రోడ్డు మీద రచ్చ చేయడం సరికాదని మందలించారు. వర్మకు తక్షణమే కౌన్సెలింగ్ ఇవ్వాలని, కూటమి పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూడాలని పల్లాను ఆదేశించినట్లు సమాచారం. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవనే సంకేతాన్ని కూడా పరోక్షంగా పంపారు.

సోషల్ మీడియా వార్‌పై చంద్రబాబు ఆందోళన

మంగళవారం నాటి ఘటన తర్వాత సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై అధినేత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు విడిపోతే అది వచ్చే ఎన్నికల్లో లేదా భవిష్యత్ రాజకీయాల్లో పెను నష్టాన్ని కలిగిస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ వివాదానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని, వర్మను పిలిచి మాట్లాడి జనసేన నేతలతో సయోధ్య కుదిర్చేలా చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి రిపీట్ అయితే కఠిన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'పెద్ది'లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha