No Break For VB-G RAM G scheme : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పనుల కోసం ఉపాధి హామీ (VB-G RAM G) పనులకు ఇచ్చే రెండు నెలల విరామాన్ని (Break) ఈసారి రద్దు చేసి, నిరంతరాయంగా పనులను కొనసాగించాలని భావిస్తోంది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉపాధి హామీ పనులకు విరామం ఇస్తుంటారు. అయితే ఈసారి వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 45 శాతం మేరకే రైతులు పంటలు వేశారు. వచ్చే అక్టోబర్ వరకు ఎల్‌నినో పరిస్థితులు కొనసాగి వర్షాలు తగ్గుముఖం పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది మున్ముందు యాసంగి సీజన్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.ఈ పరిస్థితుల్లో కూలీలకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉన్నందున, 2026-27 ఆర్థిక సంవత్సరంలో 2 నెలల విరామం అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది.
Read Also: Engineering admissions: ఈ నెల 22న బీటెక్ సీట్లు కేటాయింపు
No Break For VB-G RAM G scheme
No Break For VB-G RAM G scheme : ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ‘జలసిరి’ కార్యక్రమం
కరవు మరియు వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘జలసిరి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, కరవు నివారణ చర్యలతో పాటు గ్రామీణ ప్రాంత కుటుంబాలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ ఈ ‘జలసిరి’ నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 9.60 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణం. 5,000 బోర్‌వెల్ రీఛార్జ్ పాయింట్లు. ఊట కుంటలు: 5,000 ఊట కుంటల నిర్మాణం. సేద్యపు కుంటలు: మహిళా రైతుల కోసం ఇప్పటికే 25,000 సేద్యపు కుంటలు మంజూరు కాగా, మరిన్ని దరఖాస్తులు వస్తే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజుకు 5 లక్షల మందికి ఉపాధి - 4.5 కోట్ల పనిదినాలు జులై 1న ప్రారంభమైన ఈ పథకం తొలి దశ కింద అక్టోబర్ వరకు 4.5 కోట్ల పనిదినాలను సృష్టించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం రోజుకు సగటున 2.5 లక్షల మంది కూలీలు ఉపాధి పొందుతుండగా, ‘జలసిరి’ నీటి సంరక్షణ పనుల ద్వారా రోజుకు 5 లక్షల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.
Epaper: epaper.vaartha.com

