Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్షాకాలంలో ఆకు కూరలు తినొచ్చా?

వర్షాకాలంలో ఆకు కూరలు తినొచ్చా?

వార్త 2 weeks ago

Rain Season : వర్షాకాలం రాగానే చాలామంది ఆకుకూరలు తినడానికి కాస్త వెనకాడుతుంటారు. ఈ సీజన్‌లో ఆకుకూరలు తింటే డయేరియా (విరేచనాలు), కడుపునొప్పి వంటి రోగాల బారిన పడతారనే ఒక బలమైన నమ్మకం జనాల్లో ఉంది.

అయితే, ఆకుకూరలు తినడం వల్ల నేరుగా విరేచనాలు అవుతాయనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమస్య ఆకుకూరల్లో లేదు, వాటిని శుభ్రం చేసే విధానంలో ఉందంటున్నారు. వర్షాల కారణంగా పొలాల్లోని మట్టి, బురద ఆకులపై ఎక్కువగా పేరుకుపోతాయి. దీనికి తోడు తేమతో కూడిన వాతావరణం వల్ల కంటికి కనిపించని రకరకాల కీటకాలు, బ్యాక్టీరియా, వాటి గుడ్లు ఆకుకూరలపై చేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని వండుకుని తింటేనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

శుభ్రం చేసే సరైన పద్ధతి: రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవచ్చు?

వర్షాకాలంలో ఆకుకూరల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే వాటిని కడిగే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆకుకూరలను మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే నేరుగా వండకుండా, గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ వేసి అందులో దాదాపు 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మళ్లీ మంచి నీటితో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాతే వండుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉన్న క్రిములు, మట్టి పూర్తిగా తొలగిపోతాయి. వర్షాకాలంలో కూడా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభించాలంటే రోజుకు 50 గ్రాముల చొప్పున ఆకుకూరలను నిరభ్యంతరంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చని, కాకపోతే బాగా ఉడికించిన తర్వాతే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్లాస్టిక్ డబ్బాల్లో భోజనం.. పిల్లల ప్రాణాలకే ప్రమాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha