Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్షాలు ఒకవైపు.. వడగాల్పులు మరోవైపు!

వర్షాలు ఒకవైపు.. వడగాల్పులు మరోవైపు!

వార్త 6 days ago

AP Rains Warning APSDMA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో వాతావరణం తీవ్ర హెచ్చరికల మధ్య మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో సోమవారం (జూన్ 8) ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కీలక ప్రకటన విడుదల చేసింది.

పసిఫిక్ మరియు బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా రాయలసీమ మరియు ఉత్తర కోస్తా పరిధిలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Read also:Weather Updates: కేరళ, కర్ణాటకల్లో 7 రోజుల పాటు భారీ వర్షాలు!

ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రధానంగా ఉరుములు పడే సమయంలో గొర్రెల కాపరులు, వ్యవసాయ కూలీలు, రైతులు బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పిడుగులు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద పెద్ద చెట్ల కింద, పాతబడిన తాత్కాలిక షెడ్లలో లేదా విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో నిలబడొద్దని అధికారులు స్పష్టం చేశారు.

 Lightning storms and heatwaves on Monday; APSDMA issues high alert

AP Rains Warning APSDMA: మరోవైపు రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పిడుగుల వర్షాల హెచ్చరికలు ఉండగానే, మరోవైపు పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు (Heatwaves) వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా పరిసరాలు, పోలవరం ప్రాంతం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, వృద్ధులు మరియు చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha