Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళ, కర్ణాటకల్లో 7 రోజుల పాటు భారీ వర్షాలు!

కేరళ, కర్ణాటకల్లో 7 రోజుల పాటు భారీ వర్షాలు!

వార్త 2 months ago

Weather Updates: దేశంలో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న రావలసి ఉండగా, ఈ ఏడాది మూడు రోజుల ఆలస్యంగా గురువారం కేరళలోకి ప్రవేశించాయి.

రుతుపవనాల రాకతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం.. రాబోయే ఏడు రోజులలో జూన్ 11, వరకు కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Read Also : Environmental crisis : తరుముతున్న పర్యావరణ సంక్షోభం!

 Heavy rains in Kerala and Karnataka for 7 days!

Weather Updates: కేరళలో ముంచెత్తుతున్న వానలు..

కేరళలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కొనసాగుతుండటంతో, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఐఎమ్‌డి (IMD) శుక్రవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలు:

పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిస్సూర్, కాసరగోడ్ఈ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 7 నుండి 20 సెం.మీ.ల మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.

దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఇలా..

రాబోయే వారంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదు కాబోయే వాతావరణ రుతుపవనాల విస్తరణ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే 7 రోజులు కేరళ & కర్ణాటక లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు (7-20 సెం.మీ.) కురిసే అవకాశం ఉంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఈశాన్య భారతదేశం రాబోయే వారంలో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. బికనీర్‌లోని దుంగర్‌గఢ్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పర్యావరణానికి పూడ్చలేని నష్టం చేస్తున్న మోదీ సర్కార్​: రాహుల్ గాంధీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha