60 శాతం ధాన్యం రోడ్లపైనే
TG paddy procurement: ఆకాల వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ.. యాసంగి వరి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేటలో ఆకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని బీఆర్ఎస్ అందోలు అసెంబ్లీ నియోజకవర్గ అగ్రనేత పట్లోళ్ల జైపాల్రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. యాసంగి వరి ధాన్యం ఎంత సాగవుతుందో అధికార యంత్రాంగం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం వల్లనే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కోతలు కోసి నెల రోజులవుతున్నప్పటికీ, తూకం వవే, రైస్ మిల్లులకు తరలించడంలో నిర్వహకులు అలసత్వం ప్రదర్శించారని ధ్వజమెత్తారు.
Read Also : Suravaram Pratap Reddy Jayanthi 2026: పాలమూరులో ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు
Despite knowing that rain was coming, the government failed to procure grain
TG paddy procurement: రైతులు లబోదిబోమంటున్న పట్టించుకోని అధికార యంత్రాంగం..
రెవెన్యూ, పౌర సరఫరాలు, రవాణ శాఖల మధ్య సమన్వయం కొరవడటం వల్లనే ధాన్యం తడిసి మ ద్దయిందని విచారం వ్యక్తం చేశారు రోజుల తరబడి ధాన్యం అరబెట్టి, కాపల ఉంటున్న రైతులు ఆకాల మరణం చెందుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కావడం లేదని ఆరోపించారు. ధాన్యం సేకరించాలంటూ అధికారులకు మె రపెట్టుకుంటున్నా అధికార యంత్రాంగం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతులకు టోకన్లు జారీ చేసినా తూకం వేయడం లేదన్నారు. రోడ్డుపై కల్లాలో ఎక్కడ చూసిన వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా నిల్వలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్పోలు గ్రామంలో వంద లారీల ధాన్యం పండితే, ఇప్పటి వరకు 30 లారీల ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించారని అన్నారు. గ్రామంలో ఎక్కడ చూసిన ఆరబెట్టి కుప్పలు పోసిన ధాన్యమే కనిపిస్తుందని క్రాంతికిరణ్ తెలిపారు.
అందోలు నియోజకవర్గంలో తీవ్ర నిర్లక్ష్యం
అందోలు అసెంబ్లీ నియోజకర్గంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నదని, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజనరసింహ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి సంబంధిత శాఖల అధికారులను ఎప్పటికప్పుడూ సమన్వయపర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ధాన్యం తూకం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని. డిమాండుకు తగ్గట్లుగా హమాలీలను నియమి ంచకపోవడంతో ఎక్కడికక్కడ నిల్వలు పేరుకుపోయాని ఆరోపించారు. అదనంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి హమాలీల సంఖ్య పెంచి కొనుగోళ్ల వేగం పెంచాలని డిమాండ్ చేశారు.
రెండు రోజుల్లోగా ధాన్యం సేకరణ పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఖరీప్ సీజన్ వరి తుకాల సమయం ముంచుకోస్తుందని, అప్పటిలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అన్నదాతల కష్టాలు వర్ణాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, నాయకులు దర్శన్ రెడ్డి, మిరియాల రాములు, పెద్దోల్ల విష్ణువర్ధన్ రెడ్డి, తుంగె మల్లేశం, అనిల్ రెడ్డి, తలారి దేవయ్య. బేగరి అశోక్, జొన్నాడ రాంరెడ్డి తదితరులలు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
రోడ్డు నిండా గుంతలు, విరిగిన మ్యాన్‌హోల్.. తల్లగడ్డ రోడ్ల పరిస్థితి ఇంత దారుణమా?

