Agriculture : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వ్యవసాయం ప్రకృతి అనుగ్రహంపై అధికంగా ఆధారపడుతోంది. ముఖ్యంగా ఖరీఫ్ పంటల సాగు పూర్తిగా నైరుతి రుతు పవనాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రతిఏడాది జూనన్నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు రైతులకు ఆశాజ్యోతిగా నిలుస్తాయి. అయితే ఈఏడాది నమోదవుతున్న లోటు వర్ష పాతం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు ఆలస్యంగా కురవడం, కొన్నిప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాక పోవడం వల్ల ఖరీఫ్సాగు ఆలస్య మవుతోంది. దీనివల్ల లక్షలాది మంది రైతులు అనిశ్చిత పరి స్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మరింత కొన సాగితే వ్యవసాయం మాత్రమే కాకుండా దేశ ఆహారభద్రత పైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. భారతదేశం లో సుమారు సగానికి పైగా సాగుభూమి ఇప్పటికీ వర్షా ధారంగానే ఉంది. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు, కాలు వల ద్వారా నీటి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం తో వారు పూర్తిగా వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. వర్షాలు ఆలస్యమైతే విత్తనాలు వేయలేని పరిస్థితి ఏర్ప డుతుంది. ఇప్పటికే విత్తిన విత్తనాలు తగిన తేమ లేక మొలకెత్తకపోవడం లేదా ఎండిపోవడం జరుగుతుంది. దీని వల్ల రైతులు మళ్లీవిత్తనాలు కొనుగోలు చేయాల్సి రావడం, అదనపు పెట్టుబడి పెట్టాల్సి రావడం వారి ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది.
Agriculture
Agriculture : వర్షాల ప్రభావం
ఖరీఫ్ సీజన్లో లో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పుధాన్యాలు, వేరుశెనగ వంటి పంటలు సాగు చేస్తారు. ఈ పంటల దిగు బడితగ్గితే దేశంలో ధాన్యోత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బ ణం మరింత అధికమై సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆహార పదార్థాల ధరల పెరుగుదల తీవ్రఇబ్బందులను కలి గిస్తుంది. ఈ విధంగా లోటు వర్షాల ప్రభావం రైతులకే పరిమితం కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంపైనా పడు తుంది. వాతావరణ మార్పులు కూడా ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఒకప్పుడు క్రమపద్ధతిలోకురిసే వర్షాలు ఇప్పుడు అసమానంగా కురుస్తున్నాయి. కొన్ని ప్రాం తాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి కనిపి స్తోంది. ఒకేసారి భారీ వర్షాలు కురిసి వరదలు సృష్టించ డం, తరువాత దీర్ఘకాలం వర్షాలు లేకపోవడం వంటి పరి స్థితులు వంటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఈ మారు తున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Agriculture
వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు
ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందిం చడం అత్యంత అవసరం. మొదటగా నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించడం, వర్షపు నీటిని నిల్వ చేసే నిర్మాణాలను విస్తరించడం, భూగర్భ జలాలను పునరుద్ధరించే చర్యలను వేగవంతం చేయాలి. సూక్ష్మ సాగునీటి పద్ధతులైన డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలను మరింత ప్రోత్సహించాలి. ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించే విధానాలే భవిష్య త్తులో వ్యవసాయాన్ని కాపాడగలవు. అదే సమయంలో రైతులకు ఆర్థికపరంగా కూడా ప్రభుత్వం అండగానిలవాలి. పంట రుణాల చెల్లింపుకు గడువు పొడిగించడం, అవసర మైన విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించడం, పంట బీమా క్లెయిమ్లను వేగంగా పరిష్కరించడం వంటి చర్య లు రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతాయి. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో రైతులకు తగిన సలహాలు అం దించి, పరిస్థితులకు అనువైన ప్రత్యామ్నాయ పంటలను సూచించాలి. తక్కువ నీటితో పండేపంటల సాగునుప్రోత్స హించడం ద్వారా నష్టాలనుకొంతవరకు తగ్గించవచ్చు. నీటి వనరుల సమగ్ర నిర్వహణ, వర్షపునీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల పై ప్రత్యేక దృష్టిసారించాలి. నీటి వనరుల సంరక్షణ, రైతు లకు తక్షణ ఆర్థికసహాయం, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం, దీర్ఘకాలిక నీటినిర్వహణ ప్రణాళికలు అమలు చేస్తేనే ఈ సవాలును సమర్థంగా ఎదుర్కోగలం. రైతును కాపాడటం అంటే దేశభవిష్యత్తును కాపాడటమే.
-తిప్పర్తి శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
వరంగల్ జిల్లాలో 'బంగారు' భూమి.. నిధుల కోసం అర్ధరాత్రుళ్లు తవ్వకాలు!

