Hyderabad Central University: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన విద్యార్థుల అరుపులతో ఫోన్ లాక్కొని పరారైన వ్యక్తి నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు, కట్టుదిట్టమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భద్రత కాలితాలకే పరిమితమవుతుంది.
సెంట్రల్ యూనివర్సిటీ లోపలికి భద్రత పేరుతో ఇతరులెవరికీ, కనీసం మీడియాకు సైతం అనుమతి లేదంటూ ఓ వైపు వర్సిటీ యంత్రాంగం జీవోలు జారీ చేస్తుండగా, మరోవైపు తరచూ ఆసాంఘీక సంఘటనలతో వర్సిటీ వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో బయటి నుంచి వర్సిటీ లోపలికి ప్రవేశించిన ఓ వ్యక్తి వర్సిటీ లోపల ఉన్న ఇద్దరు విద్యార్థినులకు లిఫ్ట్ ఇచ్చే సాకుతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినుల అరుపులతో అప్రమత్తమైన సదరు వ్యక్తి ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన అనంతరం వర్సిటీ హాస్టల్లోనే ఉన్న నిందితుడిని విద్యార్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు.
Read Also: Nagar Kurnool Heavy Rains:నాగర్ కర్నూలులో వర్షం బీభత్సం
Harassment at Hyderabad Central University
Hyderabad Central University: నిందితుల వివరాలు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న భూక్యా నవీన్ వర్సిటీ ఆవరణలోని ఎల్ హాస్టల్లో ఉంటున్నాడు. కాగా నవీన్ స్నేహితులైన.. కూకట్పల్లిలో బీకాం
రెండవ సంవత్సరం చదువుతున్న బి. శరత్బాబు, ఘట్కేసర్లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న ఏ. నవీన్, ఆటో డ్రైవర్ ఏ. చింటులు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి నవీన్ హాస్టల్లో ఉంటున్నారు.
వీరందరూ కలిసి రాత్రి క్యాంపస్ ఆవరణలోని నిర్మాణుష్య ప్రదేశంలో మద్యం సేవించారు. అనంతరం వీరిలో ఒకరైన శరత్బాబు బైక్ తీసుకొని క్యాంపస్ రోడ్ల మీదకు వచ్చాడు. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఓ పిహెచ్ విద్యార్థిని లిఫ్ట్ అడిగింది. దీంతో ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. ఇది గమనించిన పక్కనే ఉన్న మరో పిహెచ్ విద్యార్థిని సైతం లిఫ్ట్ అడుగడంతో ఆమెను సైతం బైక్ ఎక్కించుకున్నాడు.
వేధింపులు, పరార్
యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ వైపు వెళ్తు మార్గమద్యలో నిర్మాణుష్య ప్రదేశంలో బైక్ ఆపిన శరత్బాబు ఇద్దరు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన విద్యార్థినులు అరుస్తూ అక్కడి నుంచి పారిపోతుండగా, వారిని వెంబడించిన శరత్బాబు ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత విద్యార్థినులు జరిగిన విషయాన్ని తోటి విద్యార్థులకు చెప్పడంతో విద్యార్థులందరూ కలిసి క్యాంపస్ మొత్తం జల్లెడపట్టారు.
భూక్యా నవీన్ హాస్టల్ గదిలో శరత్బాబుతో పాటు నవీన్, చింటులు పట్టుబడడంతో విద్యార్థులు వీరిని పోలీసులకు అప్పగించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు అసభ్య ప్రవర్తన, దారి దోపిడీ కింద నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా ఈ విషయం సెంట్రల్ యూనివర్సిటీలో సంచలనంగా మారింది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని, సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడంతో పాటు సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ఏబివిపి విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

