Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరుణుడి కరుణ లేదు.. తీవ్ర ఆందోళనలో రైతులు

వరుణుడి కరుణ లేదు.. తీవ్ర ఆందోళనలో రైతులు

వార్త 0 months ago

AP Weather update:రాష్ట్రంలో 25 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావంతో జూన్ నుంచి నవంబర్ వరకు సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

గత మూడు ఎల్ నినో సందర్భాలతో పోలిస్తే, ఈసారి లోటు శాతం కొంత తక్కువగానే ఉన్నప్పటికీ, పరిస్థితిని గమనిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రైతులు, సాగునీటి శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు ఎంతో అవసరం.

Read also: AP medical seats: వైద్య విద్యార్థులకు పండగే.. అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు!

 25 percent rainfall deficit in the state.

జూలైలో తీవ్రమైన వర్షాభావం

రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలలో ఏకంగా 41 శాతం మేర వర్షపాతం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వర్షాలు ఆలస్యంగా కురవడం లేదా తక్కువగా కురవడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. సాగుకు కావాల్సిన నీటి లభ్యతపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పంటల వేళ సరైన వర్షాలు లేకపోతే దిగుబడి తగ్గడమే కాకుండా, ఖరీఫ్ సీజన్ ప్లానింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి.

AP Weather update:భూగర్భ జలాలపై పెరగనున్న ఒత్తిడి

వర్షాలు తక్కువగా కురవడం వల్ల రాబోయే రోజుల్లో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రబీ సీజన్ మొదలయ్యే నాటికి సాగునీటి కొరత తీవ్రతరం కావచ్చు. జలాశయాల్లో నిల్వలు తగ్గడం వల్ల తాగునీటి సరఫరాపై కూడా ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి యాజమాన్య పద్ధతులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.

Epaper: epaper.vaartha.com

పవన్ కళ్యాణ్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha