Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరుసగా మూడు.. రూ. 200 కోట్లతో మమిత బైజు సరికొత్త రికార్డు!

వరుసగా మూడు.. రూ. 200 కోట్లతో మమిత బైజు సరికొత్త రికార్డు!

వార్త 2 weeks ago

Mamitha Baiju: తనదైన సహజ నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మలయాళ భామ మమితా బైజు పేరు ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.

తెరపై అమాయకత్వం, ఎమోషన్స్‌ని ఎంతో సహజంగా పలికిస్తూ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ నటి, బాక్సాఫీస్ వద్ద కూడా తిరుగులేని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌కూ సాధ్యం కాని రీతిలో వరుసగా మూడు రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రాల్లో భాగమై అరుదైన మైలురాయిని అందుకుని, సౌత్ మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్‌గా నిలిచింది.

Read Also : Shalini Pandey : ఆ AI వీడియో లో ఉన్నది నేను కాదు - అర్జున్ రెడ్డి హీరోయిన్ ఎమోషనల్

 Mamitha Baiju sets a new record with Rs 200 crore!

దళపతి విజయ్ ప్రధాన పాత్రలో, హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' చిత్రంలో విజయ్‌కి కూతురిగా నటించిన మమితా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా టాక్ పరంగా డిజాస్టర్ తెచ్చుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత వర్సటైల్ స్టార్ సూర్య సరసన నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది.

Mamitha Baiju: 11 రోజుల్లోనే రూ. 200 కోట్లు సాధించిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’

మలయాళంలో నివిన్ పాలీతో కలిసి ఆమె నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' కూడా మాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది. గిరీష్ ఏ.డి తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. నివిన్ పాలీ సినీ ప్రయాణంలోనే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ లాంగ్ రన్‌లో రూ. 300 కోట్ల మార్కును సైతం సునాయాసంగా అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెప్టెంబర్ 4న మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో విడుదల

కుటుంబ బంధాలు, జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఎంతో గొప్పగా ఆవిష్కరించిన ఈ ఫీల్‌గుడ్ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రఖ్యాత పంపిణీ సంస్థ 'మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్' ద్వారా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. మలయాళంలో రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం, తెలుగులోనూ విశేషంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ విధంగా వరుసగా మూడు చిత్రాలతో రూ. 200 కోట్లు సాధించిన మమితా బైజు ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది.

'ఇరుముడి'పై దిల్ రాజు ప్రశంసలు.. రవితేజపై ఆసక్తికర వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha