Dailyhunt
వసంత మండపంలో వైభవంగా వసంతోత్సవాలు

వసంత మండపంలో వైభవంగా వసంతోత్సవాలు

వార్త 2 weeks ago

TTD Srivari Vasanthotsavam 2026: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వేడుకగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో ఈ ఉత్సవాలను టీటీడీ (TTD) అత్యంత వైభవంగా నిర్వహించనుంది.

వసంత రుతువులో స్వామివారికి ఉపశమనం కలిగించేలా సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పుష్పాలతో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మూడు రోజుల పాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Read Also :Vontimitta Brahmotsavam: మూడో రోజు ఒంటిమిట్టలో శ్రీరామ బ్రహ్మోత్సవాలు

 A procession through the temple streets for three days!

TTD Srivari Vasanthotsavam 2026:రేపు స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధి.. పలు ఆర్జిత సేవలు రద్దు!

వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన రేపు (మంగళవారం) ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామివారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ఉత్సవాల దృష్ట్యా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. అలాగే, రేపు నిర్వహించాల్సిన ‘అష్టదళ పాద పద్మారాధన’ సేవను కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇంట్లో సూర్యుడి విగ్రహం పెట్టుకోవచ్చా..? పండితులు ఏంచెపుతున్నారు ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha