Dailyhunt
మూడో రోజు ఒంటిమిట్టలో శ్రీరామ బ్రహ్మోత్సవాలు

మూడో రోజు ఒంటిమిట్టలో శ్రీరామ బ్రహ్మోత్సవాలు

వార్త 2 weeks ago

Vontimitta Brahmotsavam: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరాయి. ఆదివారం శ్రీరామచంద్రుడు వటపత్ర సాయిగా అలంకారంలో ఉదయం దర్శనమిచ్చి, రాత్రి సింహానంపై పురవీధులలో విహరించారు.

గ్రామోత్సవం కన్నుల పండుగగా సాంస్కృతిక సేవా వైభవంతో సాగింది. మర్రి ఆకుపై శయ నించిన బాలకృష్ణుని రూపంలో కోదండరాముడు భక్తులకు దర్శనమిచ్చారు.

Read also: Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

Lord Kodanda Rama in Vatapatra Sayi Alankaram at Vontimitta Temple.

Vontimitta Brahmotsavam: మాడవీధుల్లో ఆధ్యాత్మిక పరవశం

సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై వటపత్రశాయిగా కొలువుదీరిన రామయ్యను దర్శించుకునేందుకు భక్తు లు పోటెత్తారు. ఆలయ మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతుంటే, భక్తజనం ‘జయ జయ రామ, కోదండరామ’ అంటూ స్వామిని కీర్తించారు. భక్తులు తమ కోర్కెలు నెరవేరాలని కాంక్షిస్తూ దారిపొడవునా కర్పూరాలను వెలిగించి స్వామి కి భక్తితో సమర్పించారు. కర్పూర జ్యోతుల వెలుగులో మర్రి ఆకుపై చిరు నవ్వు చిందిస్తున్న రామయ్య రూపం భక్తుల హృదయాలను పులకింపజేసింది.

కళాకారుల అద్భుత నృత్య ప్రదర్శనలు

ఊరేగింపు ముందు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది కళాకారులు లయబద్ధంగా కోలాటం ఆడుతూ, రామకీర్తనలు పాడుతుంటే మాడవీధులన్నీ భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి. జానపద నృత్యాలు తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యాలు, హరిదాసుల కీర్తనలు ఈ వేడుకకు మరింత శోభను చేకూర్చాయి. శాస్త్రీయ నృత్య కళాకారులు రాముని లీలలను అభినయిస్తూ చేసిన ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

పురాణ గాథల ప్రకారం ప్రళయ కాలంలో లోకాలను తన కుక్షిలో దాచుకుని, మర్రి ఆకుపై శయనించే ఆ పరమాత్ముని ‘వటపత్రశాయి’ రూపంలో దర్శించుకోవడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఈ దివ్య వేడుకను వీక్షించిన భక్తులు కోదండరాముని కటాక్షం తమపై ఉండాలని ప్రార్థించారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీతారాముల కల్యాణం నాటికి ఒంటిమిట్టలో 85 వేల తిరుమల లడ్డులను సిద్ధం చేస్తున్నారు. మూడు వందల మంది శ్రీవారి సేవకులు లడ్డూలను సిద్ధం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ఎప్పుడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha