Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వసుధైక కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి : కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ డా. బండ ప్రకాష్

వసుధైక కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి : కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ డా. బండ ప్రకాష్

వార్త 2 weeks ago

Telangana news: ప్రపంచంలోకెల్లా భారతీయ వసుదైక కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పనైనది, ప్రతీ ఒక్కరూ ఆచరించి కాపాడుకోవాల్సిందేనని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా.

బండ ప్రకాష్ అన్నారు. అప్పుడే సమాజంలోని కుటుంబాలలో ఆనందోత్సాహాలతోపాటు మానవీయ విలువలు పెంపొందుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు తోడ్పతుడున్న తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పాటుపడాల్సిన అవసరం ఉందని సూచిస్తూ మ్యారేజ్ బ్యూరో రంగ సేవలను ప్రశంసించారు. సమాజసేవలో తమవంతు పాత్ర పోషిస్తున్న సభ్యులందరినీ అభినందించి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీనిచ్చారు.

Read also: Makthal mandal bridge works: పనులు వేగవంతం చేయాలి.. మంత్రి వాకిటి శ్రీహరి

 Vasudhaika kutumba vyavastha event

Telangana news: వివాహ వ్యవస్థలో సేవల గుర్తింపు

అసోసియేషన్ వ్యవస్థాపకుడు, రాష్ట్రాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రధాన మందిరంలో జరిగిన సంస్థ 5వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బండ ప్రకాష్ విశిష్ట అతిథులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ తదితర ప్రముఖులతో కలిసి మ్యారేజ్ బ్యూరో రంగంలో విశిష్ట సేవలందిస్తున్న నిర్వాహకులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులు, సేవాకార్య క్రమాల్లో ముందుండే ప్రము ఖులను ప్రతిష్టాత్మక మహా నంది, గౌతమ బుద్ధ సేవా రత్న, నటరాజ్, మ్యారేజ్ బ్యూరో ఐకాన్, మ్యారేజ్ బ్యూరో రత్న, ఉత్తమ సేవారత్న, శ్రమశక్తి అవార్డులను ప్రదానంచేసి ఎంతగానో అభినందించారు. ఈ సందర్భంగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షోపన్యాసంలో సభ్యులు సంవత్సర కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1800లకు పైగా వివాహాలు విజయవంతంగా నిర్వహించడం విశేషంగా నిలిచిందన్నారు. సభ్యుల ఐక్యత, సేవాభావం, పరస్పర సహకారంతో సంస్థ మరింత బలోపేతమౌతుందని తెలిపారు. మెరుగైన సమాజ నిర్మాణంలో బాధ్యతయుతంగా పనిచేస్తున్న అసోసియేషన్ సభ్యుల సమస్యలను ప్రభుత్వం తీర్చాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha