Venkatesh : టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేశ్ తన వయసుతో నిమిత్తం లేకుండా నవతరం హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో వెంకీ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వెంకటేశ్ పోర్షన్ షూటింగ్ అంతా జులై నాటికి పూర్తి కానుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని ఎలాగైనా దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also : పెద్ది సినిమాకు పైరసీ కష్టాలు.. బాక్సాఫీస్ వసూళ్లపై దెబ్బ!

సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్.. 3 నెలల వ్యవధిలోనే రెండు సినిమాలు
మరోవైపు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వెంకటేశ్ చేయబోయే సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెలలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రేజీ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలపాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. అయితే, ఒకవేళ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఏమాత్రం ఆలస్యమైనా.. అది అనిల్ రావిపూడి ప్రాజెక్టు షెడ్యూల్స్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వెంకీ మామ, ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే రెండు భారీ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద తన విక్టరీ మార్క్ చూపించాలని వెంకటేశ్ ముమ్మరంగా శ్రమిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

