Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాన్వీ కపూర్ దానికే పనికొస్తోందా ?

జాన్వీ కపూర్ దానికే పనికొస్తోందా ?

వార్త 1 week ago

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి తనయగా టాలీవుడ్‌లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ పాత్రల ఎంపికపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్, చర్చ నడుస్తోంది.

రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో విడుదలైన ‘పెద్ది’ చిత్రంలో ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్ర కేవలం అందాల ఆరబోతకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కథానాయకి పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా, దర్శకుడు కేవలం ఆమెను ఒక ‘గ్లామర్ డాల్’ లానే చూపించారని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’ చిత్రంలోనూ ఆమె పాత్ర కొన్ని సీన్లు, డ్యాన్సులకే పరిమితమైందని, ఇప్పుడు ‘పెద్ది’లోనూ అదే తంతు పునరావృతమైందని విమర్శిస్తున్నారు. ఒకవేళ శ్రీదేవి గనుక బతికి ఉంటే, తన కూతురిని ఇలాంటి బలహీనమైన, కేవలం బోల్డ్ క్యారెక్టర్‌కే పరిమితం చేసే పాత్రలో నటించేందుకు అస్సలు ఒప్పుకునేవారు కాదంటూ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read ALso : శరవేగంగా సాగుతున్న 'మెగా 158' షూటింగ్

నటన కంటే గ్లామర్‌కే ప్రాధాన్యత: టాలీవుడ్‌లో జాన్వీ భవిష్యత్తుపై సందేహాలు

జాన్వీ కపూర్‌లో మంచి నటి ఉన్నప్పటికీ, తెలుగు దర్శకులు ఆమెలోని ప్రతిభను వాడుకోకుండా కేవలం కమర్షియల్ హంగుల కోసమే వాడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘పెద్ది’ సినిమాలో ఆమె ఇంట్రడక్షన్ సీన్ల నుంచి రొమాంటిక్ ట్రాక్ వరకు చూపించిన విధానం మహిళా ప్రేక్షకులను సైతం తీవ్ర ఇబ్బందికి గురిచేసిందని, కన్సెంట్ (అనుమతి) లేని శృంగార ధోరణులను ప్రోత్సహించేలా ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో ‘మిలి’ లాంటి వైవిధ్యమైన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన జాన్వీ, టాలీవుడ్‌కు వచ్చేసరికి కేవలం పాటల్లో గ్లామర్ షో చేయడానికి మాత్రమే పనికొస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ధోరణి గనుక మున్ముందు కూడా కొనసాగితే, కేవలం గ్లామర్ కోసమే పరిమితమయ్యే హీరోయిన్లు టాలీవుడ్‌లో ఎక్కువ కాలం స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం కష్టమంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'పెద్ది' ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha