Examination system : దేశ భవిష్యత్తును నిర్మించేది విద్యా వ్యవస్థ. ఆ వ్యవస్థకు నమ్మకాన్ని అందించేది పారదర్శకమైన పరీక్షా విధానం. కానీ ఇటీవలి కాలంలో సీబీఎస్ ఈ, ఎన్టీఏ నిర్వహిస్తున్న పరీక్షల చుట్టూ ఏర్పడుతున్న వివా దాలు, ప్రశ్నాపత్రాల లీకులు, సాంకేతిక లోపాలు, నిర్వ హణలో నిర్లక్ష్యం వంటి అంశాలు విద్యార్థుల్లోనే కాకుండాతల్లిదండ్రుల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ పరీ క్షలపై ఆధారపడి ఉండగా, వ్యవస్థపై నమ్మకం దెబ్బ తినడం అత్యంత ప్రమాదకరం. ప్రత్యేకంగా నీట్ పరీక్షల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆరోప ణలు, అవకతవకలు విద్యా రంగంలో పెద్ద సంక్షోభానికి సంకేతంగా మారాయి. కేవలం పరీక్ష నిర్వహణలో చిన్న తప్పిదం కాదు, ఇది దేశ యువత ఆశయాలపై పడుతున్న మచ్చ.
Read Also : JEE Advanced 2026 : జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026లో తెలుగు విద్యార్థుల సత్తా.. టాప్-10లో ముగ్గురు
Examination system
Examination system : కంప్యూటర్ ఆధారిత విధానం
చదువుకుని మెరుగైన ర్యాంకు సాధించాలనే విద్యార్థి కృషిని కొన్ని అక్రమ శక్తులు డబ్బుతో కొనగలుగుతున్నా యనే భావన పెరగడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ, విద్యాశాఖ మొదట చేయాల్సింది విద్యార్థుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం. అది కేవలం ప్రకటనలతో సాధ్యం కాదు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్ప డిన వ్యక్తులు, మధ్యవర్తులు, కోచింగ్ మాఫియాలు, అధి కారులపై ఉదాహరణగా నిలిచే విధంగా శిక్షలు విధించాలి. తప్పు చేసిన వారు ఎంత ప్రభావశీలులైనా ఉపేక్షించకూ డదు. అప్పుడే వ్యవస్థపై ప్రజలకు మళ్లీ నమ్మకం కలుగు తుంది. ఇక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానం ద్వారా నిర్వహించడం పారదర్శకతకు కొంతవరకు ఉపయోగకరమనే అభిప్రాయం ఉంది. నిజానికి డిజిటల్ పరీక్షావిధానం వల్ల ప్రశ్నాపత్రాల ముద్రణ, రవాణావంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ప్రశ్నల ర్యాండమైజేషన్ వల్ల ఒకే ప్రశ్నాపత్రం లీక్ అవ్వడం ద్వారా మొత్తం వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు కూడా తగ్గుతాయి. అయితే కేవలం సీబీటీ విధానం ప్రవేశపెట్టడం వల్లనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావించడం పొరపాటు.
సైబర్ భద్రత
భారతదేశం వంటి విస్తారమైన దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయా లు సమానంగా లేవు. నగరాల్లో ఉన్న విద్యార్థులకు లభిం చే సౌకర్యాలు గ్రామీణ పాంతాల్లో ఉండవు. చాలాచోట్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు, కంప్యూటర్ల కొరత వంటి అంశాలు పరీక్షల నిర్వహణను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక చిన్న సాంకేతిక లోపం కూడా విద్యార్థి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుం ది. అందువల్ల సిబిటి విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమగ్ర సన్నద్ధత అవసరం. అత్యంత ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక లోపా లను ముందుగానే గుర్తించే ఫెయిల్సేఫ్ మెకానిజం’ ఉండాలి. సర్వర్లు డౌన్ కావడం, సిస్టమ్ హ్యాంగ్ అవడం, లాగిన్ సమస్యలు, డేటా కోల్పోవడం వంటి సమస్యలు పరీక్షల సమయంలో తలెత్తితే విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రత్యామ్నాయ సర్వర్లు, బ్యాకప్ పవర్ సిస్టమ్స్, సాంకేతిక బృందాలు సిద్ధంగా ఉండాలి. ఒక కేంద్రంలో సమస్య వచ్చినా పరీక్ష నిరంతరాయంగా కొనసాగించే సామర్థ్యం వ్యవస్థకు ఉండాలి. ఇంకో కీలక అంశం సైబర్ భద్రత. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షా వ్యవస్థలు కూడా హ్యాకర్ల లక్ష్యంగా మారుతు న్నాయి. విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, ప్రశ్నాపత్రాల డేటా బేస్, ఫలితాల సమాచారాన్ని రక్షించడానికి అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు అవసరం. ఇందుకోసం ప్రభు త్వం భారీగా పెట్టుబడులు పెట్టాలి. కేవలం సాఫ్ట్వేర్ కొను గోలు చేయడం సరిపోదు, నిరంతర పర్యవేక్షణ, భద్రతా పరీక్షలు, నిపుణుల నియామకం వంటి చర్యలు తీసుకో వా లి. అదేవిధంగా పరీక్షా నిర్వహణలో పారదర్శకత పెర గాలి.
Examination system
నమ్మకమే విద్యా వ్యవస్థకు మూలస్తంభం
ఏ సమస్య వచ్చినా విద్యార్థులకు స్పష్టమైన సమా చారం ఇవ్వాలి. పరీక్షా తేదీలు మారినప్పుడు, సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు, ఫలితాల ప్రకటన ఆలస్యమైన ప్పుడు అధికారుల మౌనం విద్యార్థుల్లో అనుమానాలను పెంచుతుంది. కాబట్టి ఎన్టీఏ వంటి సంస్థలు బాధ్యతా యుతంగా వ్యవహరించి ప్రజలకు సమయానుకూల సమా చారం అందించాలి. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కూడా ఇక్కడ కీలక అంశమే. ఇప్పటికే తీవ్రమైన పోటీ, కోచింగ్ ఒత్తిడి, కుటుంబ ఆశలు విద్యార్థులపై భారంగా మారుతు న్నాయి. దానికి తోడు పరీక్షలపై అనిశ్చితి పెరిగితే వారు తీవ్ర నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది. పరీక్షా వ్యవస్థ న్యాయంగా లేదనే భావన విద్యార్థుల్లో పెరగడం సమాజా నికి మంచిది కాదు. ప్రతిభ కంటే అక్రమ మార్గాలు విజ యాన్నినిర్ణయిస్తున్నాయనే భావన దేశ భవిష్యత్తుకే ప్రమా దకరం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ, ఎన్టీఏ సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. పరీక్షా వ్యవస్థను కేవలం నిర్వహణపరమైన అంశంగా కాకుండా దేశ యువత భవిష్యత్తుతో ముడిపడిన బాధ్యతగా చూడా లి. నమ్మకమే విద్యా వ్యవస్థకు మూలస్తంభం. ఆ నమ్మ కాన్ని కాపాడటంలో విఫలమైతే ఎంత ఆధునిక సాంకేతి కత ఉన్నా ప్రయోజనం ఉండదు. చివరగా చెప్పాలంటే, ఇది దేశ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న పెద్ద సవాలు.
-టి. శ్రీనివాస్
Read hindi news : hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

