Tehran Times: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న తరుణంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధాన్ని ముగించే మార్గం దొరకక ఇబ్బంది పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఏకంగా 10 వేల మంది సైనికులను (US Troops) ఇరాన్‌కు పంపాలని నిర్ణయించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Read Also: West Asia Conflict: సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ
Tehran Times: టెహ్రాన్ టైమ్స్ సంచలన ముఖచిత్రం
అమెరికా బలగాల రాకపై ఇరాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక 'టెహ్రాన్ టైమ్స్' (Tehran Times) అత్యంత ఘాటుగా స్పందించింది. తన తాజా సంచికలో అమెరికా సైనికుల ఫోటోను ప్రచురిస్తూ, దానికి "వెల్కమ్ టు హెల్" (నరకానికి ఆహ్వానం) అని పేర్కొంది..
''వెల్‌కమ్ టు హెల్'' అనే హెడ్‌లైన్‌తో ప్రచురించిన కథనంలో ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టే అమెరికా సైనికులు "శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు" అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమెరికా మరో 10,000 వరకు భూసేనలను మధ్యప్రాచ్యానికి పంపే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఇరాన్‌పై భూస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) నివేదిక ప్రకారం…
Tehran Times Welcome to Hell
అదనపు అమెరికా సైనికులను ఇరాన్‌కు సమీప ప్రాంతాల్లో మోహరించే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌కు చెందిన కీలక చమురు ఎగుమతి కేంద్రం అయిన ఖార్గ్ దీవి పరిసరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశముందని అంచనా వేసింది.ఈ చర్య ఇరాన్ లోపల భూతల సైనిక చర్యకు వాషింగ్టన్ సిద్ధమవుతోందనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. సంఘర్షణను ముగించే లక్ష్యంతో టెహ్రాన్ వాషింగ్టన్‌తో శాంతి చర్చలలో నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా.. ఈ సైనిక మోహరింపు వివాదాస్పదంగా మారుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మిడిల్ ఈస్ట్ వార్ @ 30 డేస్ ..చమురు కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూపులు !!

