Venezuela Earthquakes: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత నిమిషాల వ్యవధిలోనే రెండు అత్యంత భారీ భూకంపాలు సంభవించాయి.
గత వందేళ్లలో ఆ దేశాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇవి ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. దీని కేంద్రం కరేబియన్ తీరంలోని మొరోన్ పట్టణానికి పశ్చిమాన, కారకాస్‌కు 168 కిలోమీటర్ల దూరంలో, భూమికి 22 కిలోమీటర్ల లోతులో నమోదైంది. మొదటిది సంభవించిన కేవలం ఒకే ఒక్క నిమిషంలో మరింత శక్తివంతంగా వచ్చింది. దీని కేంద్రం మొరోన్‌కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.
Read Also: Plummeting Oil Prices : భారీగా పడిపోయిన ఆయిల్ ధరలు
Venezuela Earthquakes
Venezuela Earthquakes: కుప్పకూలిన భవనాలు - కారకాస్‌లో భయాందోళనలు
భూకంపాల ధాటికి రాజధాని కారకాస్‌లో బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు తీవ్రంగా కంపించి కుప్పకూలాయి. అల్టామైరా ప్రాంతంలో ఇళ్లు కూలిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొన్ని భవనాల గోడలు పూర్తిగా కూలిపోవడంతో లోపలి సామాగ్రి బయటకు కనిపించింది.సమీప ప్రాంతాల్లో భారీగా దుమ్ము మేఘాలు ఎగసిపడ్డాయి. రద్దీగా ఉండే రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల నుంచి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఆఫ్టర్ షాక్స్ (తదుపరి ప్రకంపనలు) వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు రాత్రంతా తమ పెంపుడు జంతువులతో సహా వీధుల్లోనే గడిపారు. వెనెజువెలా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కబెల్లో భూకంపం వల్ల పలువురు గాయపడినట్లు ధ్రువీకరించారు. దెబ్బతిన్న భవనాలు మరింత కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఆరుబయటే సురక్షితంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయంగా సునామీ హెచ్చరికలు
ఈ భారీ భూకంపాల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉండటంతో అంతర్జాతీయంగా అప్రమత్తత ప్రకటించారు. అమెరికా పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు కూడా తమ తీర ప్రాంతాల్లో అప్రమత్త ప్రకటనలు విడుదల చేశారు. మొదట హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నారు. వెనెజువెలా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కబెల్లో భూకంపం వల్ల పలువురు గాయపడినట్లు ధ్రువీకరించారు. దెబ్బతిన్న భవనాలు మరింత కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు ఆరుబయటే సురక్షితంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

