Venezuela earthquake rescue: వెనిజువెలా భూకంప రక్షణ చర్యల్లో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రకృతి సృష్టించిన ప్రళయానికి ఎనిమిది రోజులు గడిచినా, చావును ఎదురించి ఓ వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చాడు.
కూలిపోయిన భవన శిథిలాల కింది నుంచి 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్‌ను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి. మృత్యుగృహం నుంచి బయటకు రాగానే అతడు అన్న మాటలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. “నేను బతికున్నానని నా భార్యకు ఇప్పుడే చెప్పొద్దు. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఆమె మరింత బాధపడుతుంది” అంటూ అతడు వ్యక్తంచేసిన ఆవేదన అందరి హృదయాలను కదిలించింది.
Man pulled alive from the rubble after 8 days in Venezuela!
Venezuela earthquake rescue: ప్రమాదం జరిగిందిలా.. క్యాబిన్ ఇచ్చిన పునర్జన్మ
జూన్ 24న వెనిజువెలాలో వరుసగా 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపాలు తీవ్ర తలక్రిందులు చేశాయి. ఈ ప్రకంపనల ధాటికి ఒక ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అక్కడ నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్న ఫ్లోరెస్ సెక్యూరిటీ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయాడు. అయితే, భారీ భవనం కూలిపోయినప్పటికీ అతడున్న క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాకపోవడం అతడికి వరంగా మారింది. లోపలికి కొద్దిపాటి గాలి వెళ్లే అవకాశం ఉండటంతో, ఊపిరి పీల్చుకుంటూ ఎనిమిది రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడగలిగాడు.
అంతర్జాతీయ బృందాల అసాధారణ పోరాటం
ఈ అసాధ్యమైన రెస్క్యూ ఆపరేషన్‌ను అంతర్జాతీయ బృందాలు సుసాధ్యం చేశాయి. మొదట కోస్టారికా రెడ్‌క్రాస్ బృందం టెలిస్కోప్ కెమెరా సహాయంతో ఫ్లోరెస్ ఉన్న ప్రాంతాన్ని గుర్తించింది. అతడికి ధైర్యం చెబుతూనే, కెమెరా ద్వారా నీరు, ద్రవ ఆహారాన్ని అందించింది. అనంతరం చిలీ, అమెరికా, మెక్సికో, పోర్చుగల్, ఎల్ సాల్వెడార్, వెనిజువెలా దేశాలకు చెందిన రెస్క్యూ బృందాలు దాదాపు 100 గంటలకు పైగా నిరంతరాయంగా శ్రమించి, మూడు మీటర్ల మేర సొరంగం తవ్వి చివరకు ఫ్లోరెస్‌ను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చాయి.
అసాధారణ రక్షణ చర్యపై ప్రపంచవ్యాప్త ప్రశంసలు
సాధారణంగా భూకంపం సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారు 48 నుంచి 72 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో, ఎటువంటి ఆహారం లేకుండా ఎనిమిది రోజుల పాటు సుదీర్ఘంగా పోరాడి ఫ్లోరెస్ సజీవంగా బయటపడటం ఒక అద్భుతంగా భావిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి, సమన్వయంతో పనిచేసి ఒక ప్రాణాన్ని కాపాడిన అంతర్జాతీయ సహాయక బృందాలపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
సినిమా స్టైల్లో ప్రపోజ్- ఎండ్ కార్డ్ మాత్రం పోలీస్ స్టేషన్లో!

