EL nino impact:తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా తగ్గిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ కష్టకాలంలో రైతన్నలను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం.
Heatwave: దేశ ఆర్థిక వ్యవస్థపై ఎండల పంజా
October heat reminiscent of summer
అడుగంటిన జలాశయాలు.. అంతులేని నీటి కష్టాలు
కృష్ణా గోదావరి నదుల్లో నీటి మట్టాలు భారీగా పడిపోవడంతో ప్రాజెక్టులు పూర్తిగా నిండలేదు. దీనివల్ల తాగునీటి ఎద్దడి సాగునీటి సమస్యలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 21 జిల్లాల్లోని 388 మండలాలను ఇప్పటికే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. అక్టోబర్ నెలలో కూడా వేసవిని తలపించేలా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రజలను కలవరపెడుతోంది.
EL nino impact:నష్టపోతున్న రైతన్న.. ఇక చేయాల్సిందేమిటి?
భూమిలో తేమశాతం తగ్గిపోవడం వల్ల వేసిన పంటలు ఎండిపోయి పూత పిందె రాలిపోతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొవడానికి రైతులు ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు రైతులు నీటిని పొదుపుగా వాడుకోవడం ఎంతో అవసరం.
Epaper: epaper.vaartha.com

