Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెస్టిండీస్‌తో మూడో టీ20.. టీమిండియాలో మార్పులుంటాయా?

వెస్టిండీస్‌తో మూడో టీ20.. టీమిండియాలో మార్పులుంటాయా?

వార్త 2 weeks ago

IND vs WI 3rd T20: ఇండోర్ వేదికగా వెస్టిండీతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. రెండో టీ20లో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగిపుంజుకోవాలని పట్టుదలతో ఉంది.

అయితే ఈ మ్యాచ్‌లో కూడా భారత బౌలర్లకు కరేబియన్ బ్యాటర్ల నుంచి ముప్పు పొంచి ఉంది. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్‌లకు పేరుగాంచిన ఇండోర్‌ మైదానంలో బౌలర్లు చిన్న తప్పు చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు.

Big Bash League: భారత్‌లో తొలిసారిగా 'బిగ్ బాష్ లీగ్' (BBL) మ్యాచ్

స్పిన్నర్లపై భారీ భారం

ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించనుండటంతో బౌలర్లకు కఠిన సవాల్ ఎదురు కానుంది. రాంచీలో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏకంగా 501 పరుగులు నమోదయ్యాయి. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా వెస్టిండీస్ సులభంగా ఛేదించింది. ఈ నేపథ్యంలో స్పిన్నర్లు కేవలం పరుగులు కట్టడి చేయడమే కాకుండా, బ్యాటర్ల జోరును దెబ్బతీసేలా బంతిని తిప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళ మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో బాల్‌ను గ్రిప్ చేయడం బౌలర్లకు సవాలుగా మారనుంది.

ఫీల్డింగ్ వైఫల్యాలు – షై హోప్, రూథర్‌ఫోర్డ్ ముప్పు

రాంచీలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన క్యాచ్‌ను మయాంక్ యాదవ్ నేలపాలు చేయడం భారత్ కొంపముంచింది. ఆ తర్వాత రూథర్‌ఫోర్డ్ (84 పరుగులు), కెప్టెన్ షై హోప్‌తో కలిసి 120 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు.

షై హోప్ ఈ టూర్‌లో రెండు సెంచరీలతో అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, రూథర్‌ఫోర్డ్ భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. మరోవైపు భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో కేవలం 1 వికెట్ తీసి 79 పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మయాంక్ యాదవ్ వేగంతో ఆకట్టుకుంటున్నప్పటికీ పరుగులను కట్టడి చేయాల్సి ఉంది.

బ్యాటింగ్‌లో ప్రయోగాలు

భారత బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ అజేయ శతకం, తర్వాతి మ్యాచ్‌లో 40 (18 బంతుల్లో) పరుగులతో మంచి టచ్‌లో ఉన్నాడు. సంజూ శాంసన్ (82 పరుగులు) కూడా తన ఫామ్ అందుకున్నాడు. కోచ్ గౌతమ్ గంబీర్ జట్టులో ప్రయోగాలను కొనసాగిస్తూ శివమ్ దూబేను నాల్గవ స్థానానికి ప్రమోట్ చేశారు. అయితే, బౌలర్ల వైఫల్యాలను ప్రతీసారీ బ్యాటింగ్‌తోనే కప్పిపుచ్చుకోవడం సాధ్యం కాదు.

జట్టు మార్పులు

టీమ్ న్యూస్: బౌలింగ్‌లో విఫలమవుతున్న శివమ్ దూబే స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు విండీస్ జట్టులో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది.

వాతావరణం: ఇండోర్‌లో మ్యాచ్ జరిగే సమయంలో ఎలాంటి వర్షం పడే సూచనలు లేవు. సాయంత్రం 6 గంటలకు ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, 7 గంటలకు 28 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది.

హోప్ సెంచరీ.. టీమిండియాపై విండీస్ సంచలన విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha