Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ 2027కు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్

ఐపీఎల్ 2027కు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్

వార్త 2 weeks ago

Sourav Ganguly: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్‌లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. 2027 ఐపీఎల్ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా గంగూలీని నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే జరిగితే ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌గా ఆయనకు ఇదే తొలిసారి కానుంది.

Read Also :Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్‌బై

హేమంగ్ బదానీ స్థానంలో గంగూలీ?

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు హేమంగ్ బదానీ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 2027 సీజన్‌కు ఆయన స్థానంలో సౌరవ్ గంగూలీని తీసుకురావాలని ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు సమాచారం. గంగూలీకి కోచింగ్, క్రికెట్ పరిపాలనలో ఇప్పటికే అనుభవం ఉంది. అయితే ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌గా మాత్రం ఇప్పటివరకు బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ఈ నియామకం ఖరారైతే ఆయనకు కొత్త పాత్ర కానుంది.

Sourav Ganguly: ఢిల్లీ క్యాపిటల్స్‌తో గంగూలీకి పాత అనుబంధం

సౌరవ్ గంగూలీకి ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇప్పటికే అనుబంధం ఉంది. గతంలో జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే.. ఫ్రాంచైజీతో ఆయన అనుబంధం మరో దశకు చేరుతుంది. అయితే గంగూలీ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇది సమాచారంగానే పరిగణించాల్సి ఉంటుంది. 2027 ఐపీఎల్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో ఎలాంటి మార్పులు ఉంటాయనేది అధికారిక ప్రకటన తర్వాత స్పష్టత రానుంది.

సూర్యకుమార్ యాదవ్‌కు మరో షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha