Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విదేశాలకు వెళ్లే వారికి ఊరట.. కొత్త పన్నులపై కీలక స్పష్టత

విదేశాలకు వెళ్లే వారికి ఊరట.. కొత్త పన్నులపై కీలక స్పష్టత

వార్త 3 months ago

Foreign Travel Tax: అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా పన్ను లేదా సెస్ విధించబోతోందంటూ ఒక ప్రముఖ బిజినెస్ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన కథనం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని ఇటీవల కోరిన మాటలను సదరు సంస్థ తప్పుగా వాడుకుంది. అయితే, ఈ తప్పుడు ప్రచారానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకట్ట వేశారు. ఈ వార్తల్లో ఆవగింజంత కూడా నిజం లేదని, ప్రజల జీవన ప్రమాణాలను సులభతరం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు.

Read Also:Bihar Railway Station Viral Video: ట్రాక్‌పై దూసుకొచ్చిన రైలు..ప్రాణాలకు తెగించి ఇద్దరు పిల్లలను కాపాడిన వీరమాత!

Foreign Travel Tax: అవాస్తవ ప్రచారాలపై స్వయంగా స్పందించిన ప్రధాని

మరోవైపు ఆర్థిక రంగానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ కథనంలోని లోపాలను ఎత్తిచూపారు. అంతర్జాతీయ ప్రయాణికులు వివిధ మార్గాల్లో (క్రెడిట్ కార్డులు, విదేశీ వెబ్‌సైట్లు, రోడ్డు మార్గాలు) ప్రయాణిస్తుంటారని, వారందరిపై ఒకే రకమైన పన్ను విధించడం ఆచరణలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇలాంటి సున్నితమైన ఆర్థిక పరిస్థితుల్లో బాధ్యతారహిత్యంగా ఊహాజనిత కథనాలను ప్రసారం చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో విదేశీ ప్రయాణికులు, పర్యాటక రంగ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ముగిసిన ట్రంప్ చైనా పర్యటన..బయటికి రాని పలు ఒప్పందాల వివరాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha