Bihar Railway Station Viral Video: రైల్వే నిబంధనలను ఉల్లంఘించి పట్టాలు దాటడం ఎంతటి ప్రమాదకరమో చాటిచెప్పే ఘటనే అయినప్పటికీ, ఇందులో ఓ తల్లి చూపిన మాతృప్రేమ, ధైర్యం నెటిజన్లను అబ్బురపరుస్తోంది.
బీహార్‌లోని షాహ్‌పూర్ పట్టోరి రైల్వే స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఇద్దరు పిల్లలను తీసుకుని పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా రైలు రావడంతో ప్లాట్‌ఫారమ్ పైకి వెళ్లే దారి లేక, ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను వెంటనే పట్టాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో పడుకోబెట్టి, వారిని కవచంలా అల్లేసింది.
Read Also:Karnataka private bus : కర్ణాటకలో బస్సు ప్రయాణం భారమే.. మహిళల ఉచిత స్కీమ్ వల్లే నష్టాలా?

Bihar Railway Station Viral Video:కళ్లముందే మృత్యువు.. అయినా బెదరలేదు!
రైలు వేగంగా వారి మీదుగా దూసుకెళ్తున్నంత సేపు ప్లాట్‌ఫారమ్‌పై ఉన్నవారంతా ఏం జరుగుతుందోనని భయంతో కళ్లు మూసుకున్నారు. రైలు వెళ్లిన తర్వాత చూస్తే.. తల్లి ఒంటిపై గాయాలైనప్పటికీ, పిల్లలిద్దరూ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కుతున్నప్పటికీ, రైల్వే స్టేషన్లలో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ట్రాక్‌లు దాటవద్దని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
గ్వాలియర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్!

