Dailyhunt
విదేశాల్లో భారతీయుల దొంగతనం

విదేశాల్లో భారతీయుల దొంగతనం

వార్త 1 week ago

బాలి రిసార్టులో షాకింగ్ ఘటన

Indian tourists : ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయ పర్యాటకులు తలదించుకునే ఘటనకు పాల్పడ్డారు. అక్కడ ఉన్న ఒక రిసార్టులోని వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించి హోటల్ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయారు.

బ్యాగుల్లో హోటల్ వస్తువులు

గియాన్యర్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో నలుగురు భారతీయులు రెండు మూడు రోజులు బస చేశారు. ఏప్రిల్ 19న గదులు ఖాళీ చేస్తూ హోటల్‌కు చెందిన పలు వస్తువులను తమ బ్యాగుల్లో వేసుకున్నారు. గదులను తనిఖీ చేసిన సిబ్బందికి కొన్ని వస్తువులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.

తనిఖీలో బయటపడిన నిజం

వాళ్ల బ్యాగులను తనిఖీ చేయగా అందులో హెయిర్ డ్రైయర్, టవల్స్, డోర్ మ్యాట్, టీవీ రిమోట్, అలాగే డైనింగ్‌కు సంబంధించిన పలు వస్తువులు బయటపడ్డాయి. దీంతో హోటల్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

వైరల్ అయిన వీడియో

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విదేశాల్లో ఇలాంటి ఘటనలు భారతీయుల పరువును తీస్తున్నాయని నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

Read Also: Tamil Nadu Election Survey: తమిళనాడు ఓటర్ల మొగ్గు అటే.. జేవీసీ పోల్ అంచనా

పోలీసులకు ఫిర్యాదు చేయలేదు

అయితే ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా (Indian tourists) సామరస్యంగా పరిష్కరించింది. దొంగిలించిన వస్తువులను తిరిగి ఇవ్వడంతో పర్యాటకులను వెళ్లనిచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha