Delhi railway station : ప్రస్తుత సమాజంలో ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసేవారు అరుదుగా కనిపిస్తారు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక అపరిచిత వ్యక్తి చేసిన పని నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
ఒక విదేశీ యువతికి సాయం చేసే క్రమంలో ఆయన ఏమాత్రం ఆలోచించకుండా రైల్వే ట్రాక్‌పైకి దూకి, తన మంచితనాన్ని చాటుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ట్రాక్‌పైకి దూకిన అపరిచిత హీరో
ఇండోనేషియాకు చెందిన డిజిటల్ క్రియేటర్ ఇందా ఢిల్లీ స్టేషన్‌లో ఉండగా, ఆమె దుపట్టా ప్రమాదవశాత్తు రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆమె అయోమయంలో ఉండగానే, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించారు. చేత్తో తీయడానికి వీలుపడకపోవడంతో, ఏమాత్రం జంకకుండా ట్రాక్‌పైకి దూకి ఆ దుపట్టాను తీసి ఆమెకు అందించారు.
Read Also:Shreyas Iyer: ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: శ్రేయస్ అయ్యర్
Delhi railway stationకృతజ్ఞతల కోసం కూడా ఆగని వైనం
ఆ యువతి సాయం చేసేందుకు చెయ్యి అందించినా సున్నితంగా తిరస్కరించి, ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కిన ఆయన కనీసం ఆమె చెప్పే ‘థాంక్స్’ కోసం కూడా ఆగకుండా తన దారిన తాను వెళ్ళిపోయారు. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ఆయన నిస్వార్థ గుణానికి కృతజ్ఞతలు తెలిపింది. 41 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో చూసిన నెటిజన్లు, “ఆయనే అసలైన జెంటిల్‌మన్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

