Ethanol -20 : దేశంలో రెండు దశాబ్దాలకు పైగా అమలవుతున్న ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ఇ-20 స్థాయికి అంటే 20 శాతానికి చేరుకోవడంతో దాని ప్రయోజనాలు, పరిమితులు, దీర్ఘకాలిక ప్రభావాలపై చర్చలు ఊపందుకు న్నాయి.
చమురు దిగుమతులనుకొంత మేర తగ్గించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, శిలాజ ఇంధనాలవల్ల ఏర్పడే కర్బన ఉద్గారాలను నియంత్రిం చడం, చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు అదనపు వినియోగా వకాశాలు కల్పించి రైతుల ఆదాయం పెంచడం ఈ విధానం ప్రధాన లక్ష్యాలు. అయితే, ఆహార అవసరాలకు ఉపయోగపడే పంటలను ఇంధన ఉత్ప త్తికి మళ్లించడం సమంజసమేనా? ప్రకృతి విపత్తులు, వాతా వరణ మార్పుల వల్ల పంటల దిగుబడి తగ్గితే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? అన్న ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తూనే ఉ న్నాయి. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం 2003లో బ్రెజిల్, అమెరికా వంటి దేశాల తరహాలో ఇథనాల్ సమ్మిళితపెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహించడం ( ప్రారంభించింది. ఇథనాల్ అనే ఆల్కహాల్ రకానికి చెందిన సేంద్రీయ పదార్థం చెరకు, మొక్క జొన్న వంటి పంటలను పులియబెట్టడం ద్వారా ఉ త్పన్నమవుతుంది.
Ethanol -20
Ethanol -20 : విదేశీ మారకద్రవ్యం ఆదా
2013-14లో దేశ సగటు ఇథనాల్ మిశ్రమం 2శాతానికి లోపే ఉండేది. అది క్రమంగా పెరుగుతూ, 2025 చివరి నాటికి 20శాతం లక్ష్యాన్ని గడువుకంటే ముందుగానే సాధించింది. దాంతో 2026 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా ఇ-20 ప్రామాణిక పెట్రోల్గా గా ప్రకటించబడిం ది. ఈ లక్ష్య సాధన కోసం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. 2017-18లో సుమారు 500 కోట్ల లీటర్లు మాత్రమే ఉన్న ఇథనాల్ ఉత్పాదనా సామర్థ్యం 2023-24 నాటికి 1,600 కోట్ల లీటర్లు దాటింది. మహా రాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో డిస్టిలరీల సంఖ్య భారీగా పెరగడంతో, ఆయా ప్రాంతాల్లో వ్యవసాయవాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడం ఆశాజనకమైన పరిణామం. ఈ కార్యక్రమం ద్వారా గత పదేళ్లలో సుమారు లక్షా 63 వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని, సంబంధిత రైతులకు పంట కొనుగోళ్లకు గాను లక్షా పదివేల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని అధి కారిక అంచనాలు చెబుతున్నాయి. ఈ సంఖ్యలు, పరిణా మాలు స్థూలంగా ఆశాజనకంగానే కనిపిస్తున్నప్పటికీ, విధాన నిర్ణయం అమలులో ఉన్న లోటుపాట్లపై ఎక్కువ చర్చ జరు గుతోంది. ఎందుకంటే అత్యుత్తమమైన విధానాలను కూడా అమలులో లోపాల వల్ల చతికిలపడవచ్చన్నది అనేక సంద ర్భాల్లో రుజువైంది.
మైలేజీ తగ్గుదల
ఇ-20పై సాధారణ ప్రజల నుండి ఎక్కు వగా వినిపించే అభ్యంతరాలు మైలేజీ తగ్గుదల, వాహనాల దీర్ఘకాలిక పనితీరుపై దాని ప్రభా వానికి సంబంధించినవి. ఇథనాల్ శక్తి సాంద్రత పెట్రోల్ కంటే తక్కువ కావడంతో, మైలేజీపై కొంత ప్రభావం ఉండటం సహజం, లీటర్ ఇథ నాల్లో సుమారు 21మెగాజౌల్స్ శక్తి ఉండగా, పెట్రోల్లో అది 32 మెగాజౌల్స్ వరకు ఉంటుంది. అయితే ఇ-20లో కేవలం 20శాతం మాత్రమే ఇథనాల్ ఉండటంతో, మైలేజీ పై వాస్తవ ప్రభావం 2 నుండి 4శాతం లోపే ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, ఇథనాల్కు అనుకూలంగా వినిపించే ఒక సాంకేతిక వాదన కూడా ఉంది. శక్తిసాంద్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఇథనాల్ ఆక్లైన్ సంఖ్య పెట్రోల్ కంటే గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. అధిక ఆక్టేన్ ఇంధనం ఇంజిన్లో అనియంత్రిత దహనం (నాకింగ్) సమ స్యను తగ్గించి, తగిన విధంగా రూపకల్పన చేసిన ఇంజిన్లలో పనితీరును మెరుగుపరచగలదని సాంకేతిక నిపుణుల అంచనా. అయితే ఈ ప్రయోజనాలు ఎంత మేరకు సాధా రణ వినియోగదారుడికి అందుతున్నాయన్నది ఇంకా చర్చనీ యాంశంగానే ఉంది. లోకల్సర్కిల్స్ అనే ప్రముఖ పౌర వేదిక నిర్వహించిన సర్వే ప్రకారం 2023కు ముందు తయారైన వాహనాలను ఉపయోగిస్తున్న వారిలో 56శాతం మంది 10 శాతానికి పైగా మైలేజీ తగ్గిందని పేర్కొన్నారు. ప్రజల అనుభవానికీ, అధికారిక అంచనాలకు మధ్య ఉ న్న ఈ గణనీయమైన వ్యత్యాసానికి గల కారణాలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన, సంతృప్తికరమైన, గణాంకాలతో కూడిన వివరణ కోసం వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. అలాగే, కొత్త వాహనాలను ఇ-20కు అనుగుణంగా తయా రు చేస్తున్నప్పటికీ, ఇప్పటికే రోడ్లపై ఉన్న కోట్లాది వాహనా లపై దీర్ఘకాల ప్రభావం గురించి ఆందోళనలు కొనసాగుతు న్నాయి.
రాజకీయ ప్రకటనలే తప్ప గట్టి భరోసా లేదు
సర్వేల్లో దాదాపు 28శాతం మంది వాహనదారులు వివిధ సమస్యలను నివేదించారు. దీనిపై కూడా ప్రభుత్వం నుండి రాజకీయ ప్రకటనలే తప్ప గట్టి భరోసాలభించలేదు. ప్రజల్లో అసంతృప్తికి మరోకారణం పెట్రోల్లో కొంత భాగా న్ని స్థానికంగా, సాపేక్షంగా తక్కువ ధరలో లభ్యమయ్యే ఇథనాల్ భర్తీ చేస్తున్నప్పటికీ, ధరలో ప్రయోజనం కని పించడం లేదు. ఒకవైపు మైలేజీపై సందేహాలు, మరోవైపు వాహనాల పనితీరుపై ఆందోళనలు, దానికి తోడు ధరల్లో ఆశించిన తగ్గుదల లేకపోవడం వెరసి 20 పై అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఇబ్బందులను స్వచ్ఛందంగా భరించ దానికి సిద్ధపడుతున్నప్పుడు, కనీసం ధరల పరంగానైనా కొంత ఉపశమనం ఉండాలని వినియోగదారులు ఆశించడం సహజమే. ఇటీవలి కాలంలో మరో వాదన కూడా ప్రము ఖంగా వినిపిస్తోంది ‘నా వాహనం ఫలానా ఇంధనంతోనే నడవాలని కట్టడి చేయడం ఎంతవరకూ సబబు? మైలేజి, వాహనం తయారీ, ఇంజన్ పనితీరు, ఇంధనం ధర వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైనబంధనాన్ని ఎంచు కునే అవకాశం నాకే ఉండటం సమంజసం కదా!, బ్రెజిల్ వంటి దేశాల అనుభవంతో పోల్చుకుంటే, ఈ ఆవేదన అర్థ వంతంగానే కనిపిస్తోంది. పర్యావరణ ప్రయోజనాల విష యంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. ఇథనాల్ మిశ్ర మం వల్ల కొన్నిఉద్గారాలు తగ్గుతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా గాలి, నాణ్యతపై దాని సమగ్ర ప్రభావాన్ని నిర్ధారించే దీర్ఘకాలిక స్వతంత్ర అధ్యయ నాలు ఇప్పటికీ పరిమితంగానే ఉన్నాయి. మరోపక్క, దేశం లోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం ఇప్పటికీ ఆందోళ నకర స్థాయిలోనే కొనసాగుతోంది.
Ethanol -20
ఫలితాలను కొలవదానికి ప్రజల అనుభవాలే కానీ ..
ఏవిధానమైనా దాని ఫలి తాలను కొలవగలిగితేనే దానిపట్ల ప్రజల్లో విశ్వాసం బలవ డుతుంది. ఇక్కడ మరో అంశం ఇథనాల్ ఉత్పత్తికి ప్రధానం గా ఉపయోగించే చెరకు వంట అత్యధిక నీటి వినియోగం కలిగిన పంటల్లో ఒకటి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇథ నాల్ ఉత్పత్తి కోసం చెరకుపండిస్తే, అది భూగర్భ జలాలపై అదనపు ఒత్తిడికి దారితీస్తుందని కొందరు నిపుణులు హెచ్చ రిస్తున్నారు. ఇంధన విషయంలో స్వయం సమృద్ధి సాధించ డం అభిలషణీయమే. కానీ దానికోసం ఆహారోత్పత్తికి కావా ల్సిన భూగర్భ జలాలను పణంగాపెట్టడం సమర్ధనీయమై నది కాదు. భవిష్యత్తులో భారత్ ఇ30, ఇ50 లేదా ఇ85 వంటి అధిక ఇథనాల్ మిశ్రమాలవైపు అడుగులు వేయాలను కుంటే, అలాంటి సమగ్రవ్యవస్థను కూడా దశల వారీగా నిట్టం చాల్సి ఉంటుంది. రెండు దశాబ్దాల ప్రయాణం తర్వాత కూడా ఆ దిశగా మన పురోగతి పూర్తి సంతృప్తికరంగా ఉందని చెప్పలేం. ప్రస్తుతం ఇ20పై చర్చ జరుగుతున్నప్ప టికీ, సమాంతరంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 2026లో ఇ22, ఇ25, ఇ27, ఇ30 మిశ్రమాలకు సంబం ధించిన ప్రమాణాలను ప్రకటించింది. ఇ85 మిశ్రమం కూడా పుణె, నాగ్పూర్ వంటి కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా అందు బాటులోకి వచ్చింది. ఇది సాధారణ పెట్రోల్ కంటే సుమారు రూ.20 తక్కువ ధరకు లభిస్తున్నప్పటికీ, మైలేజీ, ధరలోని రాయితీ మైలేజీ తగ్గుదలకు తగినంతగా ఉందా అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 15 ఐసోబ్యు దినాల్ కలపడం ద్వారా ఈ తరహా డీజిల్ ఉత్పత్తి చేసే అవకాశాలు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. చివరగా, ఇథ నాల్ విధానం విజయవంతమైందా లేదా అన్నది నిర్ణయిం చేది పారదర్శక గణాంకాలు, ఫలితాలను కొలవ దానికి స్పష్ట మైన ప్రమాణాలు, అధ్యయనాలు, ప్రజల అనుభవాలే కానీ ఆర్భాటమైన ప్రకటనలు, నినాదాలు, రాజకీయ వాదోపవాదాలు కావు.
-కృష్ణబాలాజి వల్లపోతు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

