Kadapa News: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం చిన్న భాకరాపురం గ్రామంలో మంగళవారం వీధి కుక్కల దాడిలో చిరుత పులి పిల్ల మృతి చెందినట్లు గ్రామస్థులు గుర్తించారు.
సుమారు 11 గంటల ప్రాంతంలో గ్రామంలోని కుక్కలు ఎక్కువగా అరుపులు వేశాయని అయితే అవి ఎందుకు వేస్తున్నాయో గమనించలేదని తెలిపారు. వీధి చివర ఎవరైనా కొత్త మనుషులు వచ్చారేమో అని పరిశీలించామని, ఎవరు లేనట్టు తెలుసుకొని వెళ్ళిపోయామన్నారు. అనంతరం ఉదయం ఆ ప్రాంతంలో ఉన్న రైతులు పొలాల వద్దకు వెళ్లగా సమీపంలో చిరుత పులి పిల్ల మరణించి ఉండటం గమనించారు. వెంటనే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న అన్వర్ హుస్సేన్, బీట్ ఆఫీసర్ సుచరిత, సిబ్బంది కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Read also: Lepakshi Crime: చెల్లెలి కోసం బావను చంపిన అన్న: మిస్టరీ వీడిందిలా!

Leopard cub dead body found in Kadapa
Kadapa News: పోస్టుమార్టం నివేదిక తర్వాతే అసలు కారణం
చిరుతపులి పిల్ల ఏ విధంగా మరణించింది అనే వివరాలను రైతులతోనూ, గ్రామస్తులతోనూ ఆరా తీశారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు ఏమైనా ఉన్నాయా లేక ఇతర సంఘటనలు ఏమైనా జరిగాయా అని తనిఖీ చేశారు. చిరుత పులి పిల్లను పోస్టుమార్టం నిమిత్తం దువ్వూరు పశు వైద్యశాలకు తరలించారు. అక్కడ పశు వైద్యాధికారి డాక్టర్ ఫణింద్ర రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వనిపెంట ఫారెస్ట్ అధికారి అన్వర్ హుస్సేన్ మాట్లాడుతూ చిరుత పులి పిల్లను వీధి కుక్కలు గాని, అడవి కుక్కలు కానీ దాడి చేసి ఉంటాయని భావిస్తున్నామని అయితే చివరగా పోస్ట్ మార్టం నివేదిక అలాగే ల్యాబ్ పరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే విచారణ చేస్తామన్నారు. దాని వయస్సు సుమారు 1సంవత్సరం పైగా ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

