Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి

విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి

వార్త 2 weeks ago

Nagar Kurnool Crime: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో విద్యా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఉన్నత విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ పీజీ కళాశాల (PG College) ప్రిన్సిపల్, ఒక విద్యార్థిపై లైంగికంగా మరియు మానసికంగా దాడికి పాల్పడ్డాడు.

లొంగిపోవడానికి నిరాకరిస్తూ, ప్రాణరక్షణ కోసం బాధిత విద్యార్థి ఎదురుదాడి చేయడంతో నిందితుడైన ప్రిన్సిపల్ నగ్నంగా పారిపోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also :Hyderabad Crime: టీవీ షోకి తీసుకెళ్తామని చెప్పి మహిళపై అత్యాచారం!

అసలేం జరిగింది? టీసీ కోసం వెళ్తే ఘాతుకం

పోలీసుల కథనం మరియు బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం. ఒక విద్యార్థి గత ఏడాది (2025లో) సదరు పీజీ కళాశాలలో తన కోర్సు పూర్తి చేశాడు. కాలేజీ నుంచి టీసీ (Transfer Certificate) తీసుకోవడం కోసం ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్‌ను కోరాడు. అయితే, టీసీ కావాలంటే తన ఇంటికి రావాలని ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో సదరు విద్యార్థి తన స్నేహితుడితో కలిసి రాత్రి 10 గంటల సమయంలో కొల్లాపూర్‌లోని ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లాడు. అక్కడ విద్యార్థిని లోపలికి పిలిచిన ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్.. అతనిపై బలవంతంగా లైంగిక దాడికి ఒడిగట్టాడు. ప్రిన్సిపల్ తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేస్తూ లైంగిక దాడికి పాల్పడుతుండటంతో తట్టుకోలేకపోయిన విద్యార్థి, ఆ పశువు నుంచి తప్పించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే ప్రాణరక్షణ కోసం ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ పార్టును (రహస్యాంగాన్ని) బలంగా కొరికాడు. దీంతో తీవ్ర నొప్పితో ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ నగ్నంగానే అక్కడి నుండి పారిపోయాడు.

Nagar Kurnool Crime: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు – సస్పెండ్ చేయాలని డిమాండ్:

ప్రిన్సిపల్ బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత విద్యార్థి, నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. రాత్రి జరిగిన ఈ ఘాతుకంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యాసంస్థల్లో ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడిన ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్‌ను తక్షణమే ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని, అతనిపై కఠినమైన క్రిమినల్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

భార్య కళ్లెదుటే భర్త, ప్రియురాలి ఆత్మహత్యాయత్నం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha