Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు అలర్ట్: చదువు మధ్యలో మానేస్తే స్కాలర్​షిప్ వెనక్కివ్వాల్సిందే

విద్యార్థులకు అలర్ట్: చదువు మధ్యలో మానేస్తే స్కాలర్​షిప్ వెనక్కివ్వాల్సిందే

వార్త 2 days ago

Government New Guidelines : పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందిస్తున్న ఉపకారవేతనాల (Scholarships) దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

స్కాలర్‌షిప్ మంజూరైన తర్వాత కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తుండటాన్ని గమనించిన ప్రభుత్వం, ఇకపై అలాంటి వారి నుంచి ఫీజులను పూర్తిగా రికవరీ చేసేలా సంక్షేమ శాఖలకు పూర్తి అధికారాలు కల్పించింది. ఈ కొత్త నిబంధనల ద్వారా అక్రమాలకు తావులేకుండా చేయడంతో పాటు విద్యార్థులకు కొన్ని కీలక వెసులుబాట్లను కూడా కల్పించింది.

Read Also: TG Traffic Rules Awareness: నేరాల కంటే ప్రమాదాల వల్ల పోయే ప్రాణాలే ఎక్కువ

 Government New Guidelines

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇవే:

  • ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate): విద్యార్థులు ప్రతి ఏటా కొత్త ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. కోర్సులో చేరిన మొదటి సంవత్సరం ఇచ్చిన సర్టిఫికేట్, ఆ కోర్సు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది.
  • ఒకే స్కాలర్‌షిప్ వర్తింపు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు సాధారణ ఉపకారవేతనాలు లేదా ప్రొఫెషనల్ కోర్సులకు ఇచ్చే స్టైపెండ్.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • రెండో డిగ్రీకి నో స్కాలర్‌షిప్: అదనపు డిగ్రీ లేదా రెండో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) చదివే వారికి ట్యూషన్ ఫీజు, స్కాలర్‌షిప్ అందవు.
  • దివ్యాంగులకు అదనపు లబ్ధి: దివ్యాంగులైన విద్యార్థులకు (MTF) సాధారణ విద్యార్థుల కంటే 10 శాతం అదనంగా స్కాలర్‌షిప్ అందించనున్నారు.
  • ఆధార్ అనుసంధానం తప్పనిసరి: టెన్త్ క్లాస్ మార్కుల జాబితాలో ఉన్నట్లుగానే ఆధార్ కార్డులో కూడా విద్యార్థి పేరు ఒకేలా ఉండాలి. బయోమెట్రిక్/ఆధార్ ధ్రువీకరణ (Aadhaar Verification) పూర్తయిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగుతుంది.
  • డిజిటల్ వెరిఫికేషన్: విద్యార్థుల అప్లికేషన్లు, సర్టిఫికెట్ కాపీలను కళాశాలలు డిజిటల్ రూపంలో ఈ-పాస్ (e-PASS) వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి. జిల్లా అధికారి వీటిని పరిశీలించి డిజిటల్ కీ ద్వారా నిధులను మంజూరు చేస్తారు. బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే విద్యార్థులకు ముందే సమాచారం అందిస్తారు.

Government New Guidelines : విద్యార్థుల సొంత బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా నగదు!

ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) నుంచి విద్యార్థుల దరఖాస్తులు కళాశాల నుండి సంక్షేమ శాఖకు అందిన నెల రోజుల్లోనే బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ మొత్తాన్ని నేరుగా విద్యార్థి ఆధార్ ఆధారిత బ్యాంకు ఖాతాలో (Direct Benefit Transfer) జమ చేయనున్నారు. ముఖ్యమైన షరతు: విద్యార్థి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం బోధన ఫీజు జమ చేసిన 7 రోజుల్లోగా ఆ మొత్తాన్ని సంబంధిత కళాశాల యాజమాన్యానికి చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత సమయంలోగా కాలేజీకి ఫీజు చెల్లించకపోతే, ప్రభుత్వమే సదరు విద్యార్థి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సర్పంచులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha