Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ ప్రభుత్వం

విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ ప్రభుత్వం

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని పైచదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉన్నత విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం (2026) నుంచే ఒకే ఒక కామన్ అడ్మిషన్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

సాధారణంగా ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ చదవాలనుకునే వారు ఒకలా, సాధారణ డిగ్రీ (B.A, B.Com, B.Sc) చేరాలనుకునే వారు మరోలా, అలాగే ఇతర వృత్తి విద్యా కోర్సుల కోసం వేర్వేరు వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ తిప్పలన్నింటికీ స్వస్తి పలుకుతూ, విద్యార్థుల సమయం, శ్రమ వృథా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ఏకీకృత డిజిటల్ విధానాన్ని తెరపైకి తెచ్చింది.

Read Also : ఏపీటీఎఫ్ 1938 లోకి భారీగా చేరిన ఉపాధ్యాయులు.. ప్రభుత్వంపై పోరుకు సై!

అర్హతల గుర్తింపు.. అక్కడి నుంచే నేరుగా అప్లికేషన్!

ఈ సరికొత్త కామన్ పోర్టల్ ద్వారా విద్యార్థులు కేవలం ఒకే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా సదరు విద్యార్థి ఇంటర్‌లో సాధించిన మార్కులు, గ్రూపును బట్టి ఏయే కోర్సులకు అర్హత (Eligibility) ఉందో ఆ వివరాలన్నీ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తాయి. విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా తమకు నచ్చిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ లేదా నచ్చిన డిగ్రీ కోర్సులను ఎంచుకుని, అదే పోర్టల్ నుండి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల ఏ కోర్సుకు ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలనే అయోమయం తొలగిపోవడమే కాకుండా, అడ్మిషన్ల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు.

ఆధార్ లింకేజ్.. సర్టిఫికెట్ల అప్‌లోడ్ జంఝాటం లేనట్లే!

ఈ సరికొత్త విధానంలో విద్యార్థులకు చేకూరే అతిపెద్ద ఉపశమనం సర్టిఫికెట్ల వెరిఫికేషన్. అభ్యర్థి ఆధార్ నంబర్‌తో అన్ని రకాల ధ్రువపత్రాలను అనుసంధానం (Link) చేయడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. కుల ధ్రువీకరణ పత్రం (Caste Certificate), ఆదాయ ధ్రువీకరణ పత్రం (Income Certificate), నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇంటర్ మార్కుల లిస్టులు కూడా ఆధార్‌తో ముడిపడి ఉంటాయి. దీనివల్ల దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు ప్రత్యేకంగా స్కాన్ చేసి, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. డేటా మొత్తం ఆటోమేటిక్‌గా సిస్టమ్ గ్రహిస్తుంది కాబట్టి, ఆన్‌లైన్ సెంటర్ల చుట్టూ తిరిగే బాధలు తప్పడమే కాకుండా పొరపాట్లకు తావుండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జూన్ 12 నుంచి కొత్త పింఛన్ల పంపిణీ.. ఆన్‌లైన్ దరఖాస్తులు షురూ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha