Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందే - రాహుల్ డిమాండ్

విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందే - రాహుల్ డిమాండ్

వార్త 2 weeks ago

CJP Protest in Delhi : దేశంలో చోటుచేసుకుంటున్న విద్యాసంబంధిత వివాదాలు, నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో (ప్రెస్ మీట్) ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 152 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దేశంలోని విద్యావ్యవస్థ పూర్తిగా సర్వనాశనమైందని, కోట్లాది మంది యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ల లీకేజీల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేసిన ఆయన, ఈ విద్యా విధ్వంసానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులకు, వారి కుటుంబాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసన: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టు!

తమ భవిష్యత్తు కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యంత అమానుషంగా లాఠీఛార్జ్ చేయడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే హక్కును కాలరాస్తూ, యువతపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న వరుస అక్రమాలు, నిరుద్యోగ పూరిత వాతావరణం మరియు నీట్ పరీక్షలలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ఘాటుగా డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సీజేపీ నిరసనలపై గాయకుడు అరిజిత్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha