Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యాశాఖకు మంత్రిని నియమించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం - పువ్వాడ

విద్యాశాఖకు మంత్రిని నియమించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం - పువ్వాడ

వార్త 3 weeks ago

Congress : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

శనివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కనీసం ఒక పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని కూడా నియమించుకోలేని దయనీయ స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కీలకమైన విద్యాశాఖకు నాథుడు లేకపోవడం వల్లే విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు.

రూ. 9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్.. ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక

కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 9,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్‌షిప్ నిధులు పెండింగ్‌లో పడిపోయాయని పువ్వాడ అజయ్ కుమార్ ఈ సందర్భంగా గణాంకాలతో సహా వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు, విద్యా దీవెన నిధులు అందించి ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ అలసత్వం వల్ల నిధులు విడుదల కాక అటు విద్యా సంస్థల నిర్వాహకులు, ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ఉపాధ్యాయులకు మరియు సిబ్బందికి వేతనాలు కూడా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు.

చౌటకూర్ లో 350 మంది విద్యార్థులకు ఉచిత టీ-షర్టులు పంపిణీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha