Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చౌటకూర్ లో 350 మంది విద్యార్థులకు ఉచిత టీ-షర్టులు పంపిణీ

చౌటకూర్ లో 350 మంది విద్యార్థులకు ఉచిత టీ-షర్టులు పంపిణీ

వార్త 3 weeks ago

Choutakur schoo:వాణిశ్రీ ఉపాధ్యాయురాలు కుటుంబం సేవాభావానికి ప్రశంసలు. సంగారెడ్డి జిల్లా శివంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) చౌటకూర్‌లో శనివారం సేవా కార్యక్రమం నిర్వహించారు.

పాఠశాలలోని 350 మంది విద్యార్థులకు రూ. లక్ష వ్యయంతో టీ-షర్టులను పంపిణీ చేశారు. పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి అద్దంకి తిరుమల వాణిశ్రీ, ఆమె భర్త స్కూల్ అసిస్టెంట్ శ్రీ సంపత్ కుమార్, వాణిశ్రీ తండ్రి శ్రీ వెంకట కృష్ణమాచార్యులు, సోదరులు శ్రీ నరసింహాచార్యులు (అమెరికా), శ్రీ సుప్రసన్నాచార్యులు (కెనడా)ల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల పట్ల సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి అందరికీ నాణ్యమైన టీ-షర్టులను అందజేయడం విశేషమని పలువురు అభినందించారు.

Read also: Dilsukhnagar Protest Today: 19 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగుల ఆందోళన

 Distribution of T-shirts to 350 students

Choutakur schoo:విద్యార్థుల ముఖాల్లో కనిపించిన ఆనందం

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి వేదశ్రీ మాట్లాడుతూ, పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి ఉదారంగా సహకరించిన వాణిశ్రీ, ఆమె కుటుంబ సభ్యుల సేవా దృక్పథం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ బృందం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీ-షర్టులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వాణిశ్రీ శ్రీవాస్తవ్, శ్రీనిజతో పాటు పాఠశాల ఉపాధ్యాయ లు పాల్గొన్నారు

Epaper: epaper.vaartha.com

సదాశివపేట12వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha