Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది.. హరీశ్ రావు

విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది.. హరీశ్ రావు

వార్త 4 months ago

Siddipet News: రాష్ట్రంలో 30 డీఈఓ పోస్టులు ఖాళీగా పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది. రాజకీయ కక్షతో మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారు.

పెండింగ్ బిల్లులు, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Read Also: TOSS SSC Inter Results 2026: నేడే టాస్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

 The Congress government has abandoned the education system.. Harish Rao

Siddipet News: ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ..

రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారు. 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి విద్యావ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేసింది. అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. తక్షణమే రెగ్యులర్ డీఈఓలను నియమించాలి. పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు, ఈ ఏడాదివి నాలుగు నెలలు పెండింగ్‌లో ఉండటంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతోంది.

గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడం సరికాదు. కావాలంటే పథకం పేరు మార్చుకోవాలి కానీ, బడుల అభివృద్ధిని ఆపొద్దు. కొత్తగా ఒక్క గది కూడా కట్టే ప్రయత్నం చేయడం లేదు. ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు, డీఏల సమస్యలతో పాటు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొంది.

డీఈఓ శ్రీనివాస్ రెడ్డి సేవలపై ప్రశంసలు

సాధారణంగా సొంత జిల్లాలో డీఈఓగా పనిచేసే అవకాశం రాదు. కానీ శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట బిడ్డ కావడంతో, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఇక్కడ అవకాశం కల్పించాము. నాలుగు సంవత్సరాల పాటు డీఈఓగా సొంత జిల్లాకు సేవలందించి, ఎవరి మనసు నొప్పించకుండా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఆయన అందరి మన్ననలు పొందారు. వరుసగా ఆరు సంవత్సరాలు పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడంలో డీఈఓగా శ్రీనివాస్ రెడ్డి చేసిన విశేష కృషి ఎంతో ఉంది. మన ఊరు – మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయించి, అత్యధిక పాఠశాలలు బాగుపడటంలో ఆయన పాత్ర కీలకం. అదనంగా జిల్లా క్రీడాధికారిగా కూడా బాధ్యతలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు.

నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేయడం వల్లే చాలా మందికి డీఈఓలుగా అవకాశం దక్కింది. తద్వారా విద్యావ్యవస్థపై క్లోజ్ మానిటరింగ్ సాధ్యమైంది. ఖానాపూర్‌లో పుట్టి పెరిగిన తిమ్మాయిపల్లి ముద్దుబిడ్డ శ్రీనివాస్ రెడ్డికి ఇది పదవికి మాత్రమే విరమణ, ఆయన సేవలకు విరమణ లేదు. భవిష్యత్తులోనూ ఈ ప్రాంతానికి ఆయన తన సేవలు అందించాలి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

111 జీవో ఎత్తివేతే లక్ష్యం.. అధికారంలోకి రాగానే అమలు: కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha