Electricity Artisans Termination: తెలంగాణలో విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె తీవ్రరూపం దాల్చింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మె గురువారం నాటికి 9వ రోజుకు చేరుకుంది.
దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రభుత్వం ఎస్మా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆర్టిజన్లు సమ్మె చేస్తూ తమ ఆందోళనలను ఉధృతంగా కొనసాగిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై విద్యుత్ సంస్థలు కొరడా ఝులిపిస్తున్నాయి.
Read Also: Tandur Fake Cotton Seeds: తాండూర్ లో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
Artisans’ strike enters 9th day
Electricity Artisans Termination: విధులకు హాజరుకాకపోతే తొలగింపు: సంస్థల అల్టిమేటం
ఆర్నెళ్ల పాటు సమ్మెలపై నిషేధం అమలు లో ఉన్నందున విధులకు హాజరు కాకపోతే ఆర్టిజన్లను తొలగిస్తామని విద్యుత్ సంస్థలు అల్టిమేటం ఇచ్చాయి. సమ్మెలో పాల్గొనడం సేవా నియమావళి ఉల్లంఘనగా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. గురువారం ఉదయం 11 గంటలలోపు విధుల్లో చేరకపోతే (డీమ్డ్ టూ టెర్మినేషన్) ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ (ట్రాన్కో) హెచ్చరించినా వాటిని పెడచెవిన పెట్టడంతో టెర్మినేటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
సమ్మె ప్రభావం, ప్రత్యామ్నాయ చర్యలు
అలాగే ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ ఎస్మా ప్రయోగించిన సర్కార్ విద్యుత్ సంస్థల్లో ఉద్రిక్త పరిస్థితులు 9వ రోజుకు చేరుకున్న సమ్మె విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం సంస్థలు కూడా సమ్మెలో ఉన్న ఆర్టిజన్లు 24 గంటల్లోగా విధుల్లో చేరాలని నోటీసులు జారీ చేశాయి. అంతేకాకుండా కార్మికుల తొలగింపునకు చర్యలు చేపట్టాయి. మరోపక్క పాల్వంచ కేటీపీఎస్ సమ్మెలో ఉన్న 51 మంది ఆర్టిజన్లను విధుల్లో నుంచి తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదేవిధంగా 2023లో కూడా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేసిన సుమారు 200 మందిని తొలగించాయి.
కార్మిక సంఘాల ఆగ్రహం
కాగా ఇదే సమయంలో విద్యుత్ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాధిపతులకు ఇప్పటికే విద్యుత్ సంస్థలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సమ్మెపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఉత్తర, దక్షిణ డిస్కంలు, జెన్ కో, ట్రాన్స్ కో నుంచి గానీ చర్చలకు అధికారికంగా ఎలాంటి పిలుపు రాలేదు. సమ్మె ప్రభావం పడకుండా అధికారులు పలు ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టారు. ఆర్టిజన్లను తొలగించేం దుకు విద్యుత్ సంస్థలు తీసుకున్న నిర్ణయంపై కార్మికసంఘాలు మండిపడుతు న్నాయి. ఈ పరిణామంతో విద్యుత్ సంస్థలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో సమ్మెలో పాల్గొంటున్న దాదాపు 20 వేల మంది ఆర్టిజన్లను తొలగించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశాయి. కాగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్ల తొలగింపుపై అంతర్గత ఆదేశాలు ఇచ్చారనేదానిపై ట్రాన్సోకో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సిఎండిలను వివరణ కోరే ప్రయత్నం చేసినా, వారి నుండి స్పష్టత రాలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

