Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం:శివశంకర్

వార్త 2 weeks ago

APSPDCL Power Complaints : ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) శివశంకర్ లోతేటి పేర్కొన్నారు.

తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి' కార్యక్రమానికి ఐదు జిల్లాల పరిధిలోని వినియోగదారుల నుండి 57 వినతులు అందాయని ఆయన తెలిపారు.

Read also: Pawan Kalyan: హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ

ఈ మైక్ సదస్సు ద్వారా పలువురు వినియోగదారులు లో-వోల్టేజ్, కొత్త కనెక్షన్ల జాప్యం, బిల్లింగ్ తప్పులు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు వంటి పలు విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. 'డయల్ యువర్ సిఎండి' కార్యక్రమం ద్వారా నమోదయ్యే ప్రతీ సమస్యను త్వరితగతిన, నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందిని శివశంకర్ లోతేటి ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి వాట్సాప్, టోల్ ఫ్రీ నంబర్లు!

ఈ నెలవారీ కార్యక్రమం ద్వారానే కాకుండా, వినియోగదారులు తమ దైనందిన విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవడానికి ఏపీఎస్పీడీసీఎల్ పలు డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చిందని సీఎండీ వివరించారు. వినియోగదారులు కింది సేవల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు

  • టోల్ ఫ్రీ నంబర్లు:1912 లేదా 1800 425 155333 (24 గంటలు అందుబాటులో ఉంటాయి)
  • వాట్సాప్ నంబరు:91333 31912 (సమస్యలను చాట్ రూపంలో లేదా ఫోటోల ద్వారా పంపవచ్చు)
  • ఏపీఎస్పీడీసీఎల్ చాట్‌బోట్ (Chat Bot): సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చాట్‌బోట్ సేవలను వినియోగించుకోవచ్చు.

APSPDCL Power Complaints: కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటీ) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్ (టెక్నికల్ & హెచ్ఆర్డీ) కే. గురవయ్య, డైరెక్టర్/ఫైనాన్స్ (FAC) కె. రామమోహన్ రావు పాల్గొన్నారు.

అలాగే చీఫ్ జనరల్ మేనేజర్లు (CGM) కె. ఆదిశేషయ్య, జె. రమణా దేవి, ఆర్. పద్మ, ఎం. మురళి కుమార్, ఎన్. శోభా వాలెంటీనా, ఎం. ఉమాపతి, కే. సంపత్ కుమార్, సిహెచ్ రామచంద్ర రావు, ఎస్. రమణతో పాటు జనరల్ మేనేజర్లు (GM) సురేంద్ర రావు, చక్రపాణి, జగదీష్, భాస్కర్ రెడ్డి, లత మరియు ఇతర ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్.. ప్రభుత్వంపై జనసేన తీవ్ర ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha