Mahabubnagar Accident: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా 200లకు పైగా మూగ జీవాలు సజీవ దహనమయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని భూత్పూర్ జాతీయరహదారిపై ఈ రోజు(గురువారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున గొర్రెల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం.. జాతీయ రహదారి పక్కన ఉన్న రైలింగ్ బోర్డు సూచికను ఢీకొట్టింది. దీంతో డీసీఎంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే వ్యాపించాయి.
Read Also : Speaker Gaddam Prasad : స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు - ఎమ్మెల్యే కూనంనేని
DCM van rams into electric pole; 200 goats burnt alive.
Mahabubnagar Accident: స్తంభాన్ని ఢీకొట్టిన డీసీఎం.. వ్యాపించిన మంటలు
స్థానిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో డ్రైవర్ రషీద్ ఖాన్ వాహనం నుంచి బయటకు దూకేసి ప్రాణాలతో బయటపడ్డాడు. వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కానీ, గొర్రెలను డీసీఎంలో లాక్ చేయడం వల్ల అవి ఎటూ పారిపోలేకపోయాయి. మంటల్లో చిక్కుకుని 200కు పైగా గొర్రెలు సజీవ దహనమయ్యాయి.
స్థానిక సమాచారం ప్రకారం, మేకల లోడుతో కర్నూలు వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ జాతీయ రహదారిపై భూత్‌పూర్ వద్దకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనంలో క్షణాల్లో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో వ్యాన్‌లో ఉన్న మేకలు బయటకు రాలేక సజీవంగా కాలిపోయాయి.
గమనించిన స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సీఎం, మంత్రుల మీదే కేసు పెట్టాలి.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

