Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విహార యాత్రలో ఘోరం.. సాఫ్ట్‌వేర్ వధువు అనుమానాస్పద మృతి!

విహార యాత్రలో ఘోరం.. సాఫ్ట్‌వేర్ వధువు అనుమానాస్పద మృతి!

వార్త 2 weeks ago

Vizag Techie Gayatri Dead: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరీ (Mussoorie)లో ఘోర కలకలం రేగింది. ఏడు నెలల క్రితమే పెళ్లయి, ఎంతో ఉల్లాసంగా వెకేషన్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం)కు చెందిన ఓ నవ వధువు..

హోటల్ రూమ్‌లో నగ్నంగా, రక్తపు మడుగులో శవమై కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విహార యాత్ర మాటున జరిగిన ఈ అనుమానాస్పద మృతి (Suspicious Death) కేసు విశాఖలోని రెండు కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపింది.

Read Also:Vadodara Bus Accident: గుజరాత్‌లో ఘోర ప్రమాదం..ఆరుగురు దుర్మరణం!

ఐటీ ఉద్యోగుల వెకేషన్.. అంతలోనే దారుణం

 Vizag Techie Radha Gayatri Dead in Mussoorie

పోలీసుల సమాచారం ప్రకారం.. మృతురాలు, ఆమె భర్త ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలోనే స్థిరపడ్డారు. ఏపీలోని విశాఖపట్నం (Visakhapatnam) నగరానికి చెందిన రాధా గాయత్రి ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె భర్త శ్రీచరణ్ పుణేలోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వీరికి గతేడాది నవంబర్ 8న పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వెకేషన్ కోసం జూన్ 13న ఈ జంట ఢిల్లీ నుంచి మొదట రిషికేష్ వెళ్లారు. ఆ మరుసటి రోజు (జూన్ 14) రాత్రి ఆలస్యంగా ముస్సోరీలోని తిప్రీధర్ ఏరియాలో ఉన్న ‘కియానా హోమ్‌స్టే’ (Kiana Homestay)కు చేరుకుని, అందులోని 'బ్లిస్' అనే రూమ్‌లో చెక్ ఇన్ అయ్యారు.

అర్ధరాత్రి మద్యం మత్తు - తెల్లారేసరికి నగ్నంగా శవమై

భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన ప్రాథమిక స్టేట్‌మెంట్ ప్రకారం.. రూమ్‌లోకి వెళ్లిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మద్యం తాగారు. చాలా సేపు మాట్లాడుకున్న అనంతరం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిద్రపోయారు. అయితే, ఉదయం లేచి చూసేసరికి రాధా గాయత్రి ఒంటిపై నూలుపోగు లేకుండా, తీవ్ర రక్తస్రావమై రక్తపు మడుగులో శవమై పడి ఉంది. దిగ్భ్రాంతికి గురైన హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. అంబులెన్స్ ఫార్మసిస్ట్ పరీక్షించి ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.

Vizag Techie Gayatri Dead: దర్యాప్తు ముమ్మరం - పోస్టుమార్టం వీడియో రికార్డింగ్

రూమ్‌లో భార్యాభర్తలు ఇద్దరే ఉండటం, భర్త తనకు ఏమీ తెలియదని చెబుతుండటంతో ఈ కేసుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మత్తులో స్పృహ తప్పి కిందపడటం వల్ల తలకు ఏమైనా బలమైన గాయమై రక్తం కారి చనిపోయిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎవరైనా వీరిని ఫాలో అయి వచ్చి దాడి చేశారా, లేక భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఏదైనా ఘాతుకం జరిగిందా అనే కోణాన్ని కూడా పోలీసులు కొట్టిపారేయడం లేదు. కేసు తీవ్రతను బట్టి ఉత్తరాఖండ్ పోలీసులు గాయత్రి మృతదేహాన్ని డెహ్రాడూన్‌లోని కోరనేషన్ ఆస్పత్రికి తరలించారు. మృతి వెనుక అసలు కారణాలు తెలుసుకోవడానికి నిపుణులైన వైద్యుల ప్రత్యేక ప్యానల్‌తో పోస్టుమార్టం నిర్వహించాలని, ఆ ప్రక్రియ మొత్తాన్ని కచ్చితంగా వీడియో రికార్డింగ్ (Video Graphy) చేయాలని ఆదేశించారు.

    Read Also hindi news: hindi.vaartha.com

    Epaper: epaper.vaartha.com

    Read Also:

    ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై అత్యాచారం

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha