Ghanpur Pump House: సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం ఘన్ పూర్ వద్ద నిర్మించిన ఘన్ పూర్ పంప్ హౌస్ నేడు అధికారులు ట్రయిల్ నిర్వహించిన సందర్బంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు..
సిద్దిపేట నియోజకవర్గం లోని వాగవతలి గ్రామాలకి సాగు నీటి కోసం నాడు కెసిఆర్ గారి ఆశీస్సులతో నీటి పారుదల శాఖ మంత్రి గా ఉన్న సమయం లో గండిపల్లి రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గం లోని ఈ వాగవతలి గ్రామాలకి నీటిని ఇవ్వాలని ప్రతిపాదన ఉండేదన్నారు. కానీ ఇక్కడి రైతులకు మేలు జరగదనే ఉద్దేశ్యం తో నాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఘన్ పూర్ పంప్ హౌస్ ) ను మంజూరు చేశామని చెప్పారు..
Read Also:Hyderabad Rain Update: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
Ghanpur Pump House: 4 వేల ఎకరాలకు జలకళ
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లోనే పంప్ హౌస్ పనుల చివరి దశ వరకు పనులు పూర్తి అయ్యాయని కొద్దీ పనులు మిగిలిపోయాయాని ఈ ప్రభుత్వం వచ్చాక పనులు చేపట్టడం లో కొంత ఆలస్యం అయినప్పటికీ నేడు ట్రయిల్ రన్ చేయడం విజయవంతం కావడం వాగవతలి ప్రాంత రైతులకు శుభవార్త అని చెప్పారు..కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా నిర్మించిన రంగనాయక సాగర్ కుడి కాలువ ద్వారా పెద్దవాగుకు చేరే నీటిని ఘన్ పూర్ పంప్ హౌస్ కు 24 మీటర్ల ఎత్తు నుండి లిఫ్ట్ చేస్తామని,
ఘన్ పూర్ పంప్ హౌస్ నుండి 24 మీటర్ల ఎత్తు నుండి కెనాల్ కు నీటిని పంప్ చేసి కెనాల్ ద్వారా వాగు అవతలి గ్రామాలకు సాగు నీరు అందనుందన్నారు.. ఇలాంటి గొప్ప కల సాకారం కావడం సంతోషం గా ఉందన్నారు.. ఈ పంప్ హౌస్ కెనాల్ ద్వారా ఘన్ పూర్, అక్కనపల్లి,గట్ల మాల్యాల, ఖాతా గ్రామాలలో 4142 ఎకరాల ఆయకట్టకు, ఘన్ పూర్ లో 4 చెరువులు, అక్కెన పల్లి లో 4 చెరువులు, గట్ల మాల్యాల లో 5 చెరువులకు నీరు రానున్నాయని చెప్పారు.. వాగు అవతలి గ్రామాల కల ఫలించిందని, సాగు నీటి కల సాకారం అయిందని సంతోషం వ్యక్తం చేశారు.. ఈ సందర్బంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ పంప్ హౌస్ భూసేకరణకు సహకరించిన వారందరికీ పాదాభివందనాలని తెలిపారు..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

