Bigg Boss juliana: ప్రముఖ తమిళ టెలివిజన్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ జూలియానా (జూలీ) తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌పై తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు.
ఇటీవల ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన గర్భస్రావానికి సీఎం విజయ్ పరోక్షంగా కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్ వర్గాలతో పాటు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
జల్లికట్టు ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన జూలీ, గత కొంతకాలంగా తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ముఖ్యమంత్రి విజయ్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్, వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ తీవ్రమైన ఆన్‌లైన్ వేధింపుల వల్ల కలిగిన మానసిక ఒత్తిడి కారణంగానే తాను కడుపులోని బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని జూలీ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Stock Market: పత్తి దిగుమతి సుంకం నిలిపివేత.. స్టాక్ మార్కెట్లో 13% లాభంతో రికార్డు!
Vijay fans trolling.. Julie says she lost her child!
Bigg Boss juliana: విజయ్ అన్న ఒక్క మాట చెప్పి ఉంటే..
“నా బిడ్డను కోల్పోవడానికి విజయ్ అన్నే బాధ్యుడు” అంటూ జూలీ ప్రత్యక్షంగా ఆరోపించారు. ఆయన నేరుగా ఈ పని చేయకపోయినా.. తన అభిమానులను, పార్టీ కార్యకర్తలను ఆపమని ఒక్క మాట చెప్పి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, తన బిడ్డ బతికేదంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణమైన కామెంట్లు పెట్టారని, చివరకు తనపై రూ. 15 లక్షల విలువైన నకిలీ కిడ్నీ స్కామ్ ఆరోపణలు కూడా సృష్టించి వేధించారని ఆమె పేర్కొన్నారు.
రాజకీయ విమర్శల వల్లే టార్గెట్ చేశారా?
గత ఎన్నికల సమయంలో విజయ్ రాజకీయ విధానాలపై తాను విమర్శలు చేయడం, మెరీనా బీచ్ వద్ద నిరసన తెలపడం వల్లే తనను లక్ష్యంగా చేసుకుని ఈ వేధింపులకు గురిచేశారని జూలీ స్పష్టం చేశారు. ప్రజలు విజయ్ అన్న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సీఎం అయ్యారని అంటున్నారంటూ ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ఆన్‌లైన్ వేధింపులపై తాను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జూలీ వెల్లడించారు.
మరోవైపు జూలీ చేసిన ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి విజయ్ మద్దతుదారులు, టీవీకే నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతోందని, రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తోందని వారు మండిపడుతున్నారు. కాగా, ఈ సంచలన వ్యవహారంపై సీఎం విజయ్ లేదా టీవీకే పార్టీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

